14 బాలుడిపై 45 మహిళ అత్యాచారయత్నం..

212
- Advertisement -

దేశ వ్యాప్తంగా మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే..ఈ నేపథ్యంలో అమ్మాయిని అబ్బాయి వేధిస్తున్నాడని ఫిర్యాదులు రావడం మామూలే కానీ ఇందుకు భిన్నంగా తమ కుమారుడ్ని ఓ మహిళ లైంగికంగా వేధిస్తోందంటూ ఓ తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. విజయవాడలోని పాయకాపురం ప్రాంతానికి చెందిన పద్నాలుగేళ్ల కుర్రాడిపై ఒక మహిళ అత్యాచార యత్నానికి ప్రయత్నించింది.

Women Rape 14 years old boy

ఆ మహిళ తన ఇంట్లోకి పిలిచి, అత్యాచారయత్నం చేసింది. దీంతో.. మహిళ లైంగిక దుశ్చర్య నుంచి తప్పించుకున్న ఆ కుర్రాడు.. తనపై జరిగిన లైంగిక దుశ్చర్య గురించి తన తల్లికి కు చెప్పాడు. ఆ తల్లి బాలుడ్ని తీసుకొని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితురాలిపై లైంగిక నేరాల నుంచి బాలులకు రక్షణ కల్పించే చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలుడ్ని ఆసుపత్రికి పంపి.. వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కేసు నమోదవ్వడం బహుశా ఏపీలో మొదటిసారేమో. మహిళను కఠినంగా శిక్షించాలని బాలుడి తల్లిదండ్రులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -