హడలెత్తిస్తున్న ‘హాలోవీన్‌’ ట్రైలర్‌..

243
Halloween
- Advertisement -

1978లో హారర్‌ జోనర్‌లో వచ్చిన హాలీవుడ్‌ చిత్రం ‘హాలోవీన్‌’.‘రాత్రికి అతను మీ ఇంటికి వస్తాడు’ అంటూ ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ‘హాలోవీన్‌’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. భయానికే భయం పూట్టించేలా ఈ మూవీ తెరకెక్కించారు. ఇంత భయంకరంగా హత్యలను చూపించిన చిత్రం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా 70 మిలియన్‌ డాలర్లను వసూలు చేసింది ఈ మూవీ. తాజాగా అదే పేరుతో దాదాపు 40ఏళ్ల తర్వాత మరో చిత్రం వస్తోంది. పాత సినిమాలో కీలక పాత్ర పోషించిన జైమీ లీ కర్టిస్‌ తాజా చిత్రంలోనూ నటించడం విశేషం.

Halloween

ఇక శుక్రవారం ‘హలోవీన్‌’ థియేట్రికల్‌ ట్రైలర్‌ను చిత్రబృంద విడుదల చేసింది. ట్రైలర్‌ను చూసి హారర్‌ సినిమాల ప్రియులు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? ఎదురు చూస్తున్నారు, మిగిలిన వాళ్లు మాత్రం భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా జాన్‌ కార్పెంటర్‌ అందించిన నేపథ్య సంగీతం వింటుంటే గుండెల్లో దడ పుట్టాల్సిందే.

ఈ మూవీని యూనివర్సల్‌ పిక్చర్స్‌ పతాకంపై మాలెక్‌ అక్ద్‌, జాసన్‌ బ్లూమ్‌, బిల్‌ బ్లాక్‌లు నిర్మిస్తున్నారు. అక్టోబరు 19, 2018న ‘హలోవీన్‌’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. డేవిడ్‌ జోర్డాన్‌ గ్రీన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జైమీ లీ కర్టిస్‌తో పాటు, జుడీ గ్రీర్‌, యాండీ మాటిచెక్‌, విల్‌ పాటన్‌, వర్జీనియా గార్డెనర్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

- Advertisement -