కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసులో ఉహించని ట్విస్ట్ నెలకొంది. పోలీసులమని చెప్పుకుంటూ కొందరు తనతో బలవంతంగా జేడీఎస్ ఎంపీ రేవణ్ణపై కేసు పెట్టించారని బాధిత మహిళ చెప్పారు. ఈ విషయాన్ని జాతీయ మహిళా కమిషన్ స్వయంగా ప్రకటించింది. ఈ సులో ఫిర్యాదు చేసిన మహిళల్లో ఒకరు తనను బెదిరించి రేవణ్ణపై అసత్య ఆరోపణలు చేయించారని వెల్లడించింది.
ఈ నేపథ్యంలో మాజీ సీఎం కుమారస్వామి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ బాధితులను బెదిరిస్తోందని, తమ పార్టీపై బురదజల్లేందుకు మహిళలతో అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని ఆరోపించారు.
దర్యాప్తు అధికారులు బాధితుల ఇంటి వద్దకు వెళ్లి బెదిరిస్తున్నారు. సిట్ అధికారులు బాధితులపై తప్పుడు వ్యభిచారం కేసులతో బెదిరించడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కిడ్నాప్ చెర నుంచి కాపాడిన మహిళల్ని మీరు ఎక్కడ దాచారు? వారిని కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టడం లేదు? ప్రశ్నించారు.
Also Read:SVC59..కత్తి నేనే..నెత్తురు నాదే!