జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌ను కలవాలని ఓ యువతి ఆయన ఇంటి ముందు బైఠాయించింది. నగరంలోని జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లోని పవన్ కళ్యాణ్ ఇంటి ముందు గత నాలుగు రోజులుగా తచ్చాడుతున్న జ్యోతి బుధవారం రాత్రి పవన్‌ను కలిసేందుకు అనుమతివ్వాలని సిబ్బందితో వాగ్వాదానికి దిగింది.
అయితే.. ప్రస్తుతం పవన్ అందుబాటులో లేరని చెప్పినా.. ఆమె వినలేదు. దీంతో.. ఆమె వ్యవహారంపై సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో.. పవన్ ఇంటి వద్దకు వచ్చిన పోలీసులు ఆమె వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె.. రోడ్డు మీద కూర్చొని ఆందోళనకు దిగింది. తాను ఎలాంటి హడావుడి చేయకున్నా.. పోలీసులు తనను ఎందుకిలా ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపించిన ఆమె.. పోలీసులు తనతో అసభ్యకరంగా వ్యవహరించారంటూ ఆరోపించింది.
నాలుగు నెలలుగా పవన్ ఇంటి చుట్టూ తిరుగుతున్నా.. సెక్యూరిటీ, పీఏ ఆయనను కలవకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించింది. తాను పవన్ అభిమానినని, కష్టాలు ఆయనతో చెప్పుకుంటే పరిష్కారం అవుతాయని తెలిపింది. అంతే కాదు తనను పవన్ పెళ్లి చేసుకోవాలని ఆమె అనడంతో మానసిక స్థితిపై అనుమానం వచ్చిన సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వచ్చి ఆమెకు నచ్చజెప్పి స్టేషన్‌కు తరలించారు.
మరోవైపు పోలీసులు ఆమెను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ.. ఆమె మాత్రం ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ఇదేనా? అంటూ పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ ఇంటి ఎదుట బైఠాయించింది. కాసేపు ఆమె తీరు మారుతుందేమోనని ఎదురుచూసిన పోలీసులకు.. ఆమె వైనం ఇబ్బందికరంగా మారటంతో ఆమెను.. పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆమె ఎవరు? ఎందుకు నాలుగు రోజులుగా పవన్ ఇంటి వద్దే ఉందన్న వివరాలు బయటకు రావాల్సి ఉంది.