- Advertisement -
ఓ నిండు గర్భిణి 108 వాహనంలో ప్రసవించింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని మలక్‌పేట్ పరిధిలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్లితే.. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రవి భార్య గౌరి (22)హైదరాబాద్‌లోని బడంగ్‌పేటలో నివాసం ఉంటోంది. తొమ్మిది నెలల నిండు గర్భిణి అయిన ఆమెకు గురువారం (అక్టోబర్ 3) సాయంత్రం పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి.
దీంతో కుటుంబ సభ్యులు ప్రైవేటు క్యాబ్‌లో ఆమెను తీసుకొని ఆస్పత్రికి బయలుదేరారు. మార్గమధ్యంలో సంతోష్ నగర్ చౌరస్తా వద్ద ఆమెను 108 వాహనంలోకి తరలించారు. 108 మలక్‌పేట చౌరస్తా వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. అంతలోనే ఆ గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో చేసేదేంలేక 108 సిబ్బంది అంబులెన్స్‌లోనే ఆమెకు ప్రసవం చేశారు. ఆ మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత తల్లీబిడ్డలను కోఠి ప్రసూతి ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -