విభిన్నమైన పాత్రలతో నటిస్తూ టాలీవుడ్ లో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది మంచు లక్ష్మీ. ఇప్పటివరకూ ఆమె చేసిన సినిమాలన్ని ఎదో ఒక మెసెజ్ తో కూడిన సినిమాలే ఉంటాయి. ఆమె నటనకు నంది అవార్డు కూడా వచ్చింది. అటు నటనతోనే కాకుండా బుల్లితెరపై కూడా తన ప్రతిభను చాటుతుంది.
సామాజిక కార్యక్రమాలు చేసుకుంటూ పేదలకు అండగా నిలుస్తుంది. తన నటించే సినిమాలో తన పాత్ర కొత్తగా ఉండేలా చూసుకుంటుంది. అయితే ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రగా .. విజయ్ యలకంటి దర్శకత్వంలో ‘w/o రామ్’ చిత్రం రూపొందింది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో ఆమె భర్త పాత్ర హత్య చేయబడుతుంది. ఆ మర్డర్ మిస్టరీని ఛేదించడానికి ఒక వైపున పోలీసులు ప్రయత్నిస్తుంటే .. మరో వైపున ఆమె కూడా తన ప్రయత్నం తాను చేస్తుంటుంది. అదే విషయాన్ని ఈ ట్రైలర్ లో ఆసక్తికరంగా చూపించారు. ట్రైలర్ ఆకట్టుకునేలా వుంది .. సినిమాపై ఆసక్తిని పెంచేదిలా వుంది. మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాలో, ప్రియదర్శి .. ఆదర్శ్ బాలకృష్ణ ముఖ్యమైన పాత్రలను పోషించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.