హిందువులు లేకపోతే ప్రపంచమే ఉండదు!

11
- Advertisement -

మణిపూర్ పర్యటనలో ఆర్ఎస్ఎస్ సర్వసంఘచాలకుడు మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. హిందువులు లేకుండా ప్రపంచం నిలవదు అని ఆయన వ్యాఖ్యానించారు. హిందూ నాగరికత అమరమైనదని .. పురాతన నాగరికతలు వంటి యునాన్‌ (గ్రీస్), మిస్ర్‌ (ఈజిప్ట్), రోమ్‌ నశించినప్పటికీ భారత్ ఎందుకు నిలిచింది అనేది దీనికి నిదర్శనమని అన్నారు.

ప్రపంచంలోని ప్రతి దేశం ఎన్నో పరిస్థితులను చూసింది. యునాన్, మిస్ర్, రోమా — అన్ని నాగరికతలు భూమిపై నుండి మాయమైపోయాయి. కానీ మన నాగరికతలో ఏదో ప్రత్యేకత ఉంది కాబట్టే మనం ఇంకా ఉన్నాం అని భగవత్ అన్నారు. “భారత్ అనేది ఒక అమర నాగరికత పేరు… మన సమాజంలో ఏర్పడిన బలమైన నెట్వర్క్ కారణంగా హిందూ సంఘం ఎప్పటికీ ఉండగలదు అన్నారు. ఇటీవల మణిపూర్‌లో జరిగిన సామాజిక ఉద్రిక్తతల తర్వాత ఆయన తొలి పర్యటన ఇదే.

సాంస్కృతిక విలువలతో పాటు ఆర్థిక స్వయం సమృద్ధి కూడా అత్యంత కీలకమని భాగవత్ అన్నారు. దేశ నిర్మాణానికి అవసరమైన మొదటి శక్తి బలం. ఆ బలం అంటే ఆర్థిక సామర్థ్యం. మన ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్వయంసమృద్ధిగా ఉండాలి. ఎవరిపైనా ఆధారపడకూడదు అన్నారు. అమెరికా భారత దిగుమతులపై అధిక సుంకాలు విధించిన తర్వాత ప్రభుత్వం స్వదేశీ విధానాలపై దృష్టి పెట్టిన సమయంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Also Read:TTD:గజ వాహనంపై పద్మావతి అమ్మవారు

బ్రిటిష్ సామ్రాజ్యంలో సూర్యుడు అస్తమించడని వాళ్లే చెప్పుకునేవారు. కానీ భారతదేశంలో వారి సూర్యుడు అప్పుడే అస్తమించడం ప్రారంభమైపోయింది. మనం 90 సంవత్సరాలు పోరాడాం. మన గళం ఎప్పుడూ మౌనం కాలేదు అన్నారు.

- Advertisement -