పచ్చి గుడ్డు తింటున్నారా.. జాగ్రత్త!

98
- Advertisement -

మన శరీరం బలంగా, దృఢంగా తయారు కావడానికి మనం తినే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. వివిద రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు, శరీరానికి కావలసిన రోగనిరోదక శక్తి పెంపొందించేందుకు పోషక విలువలు ఉన్న ఆహారం తినడం చాలా ముఖ్యం. అయితే పోషకాలను అందించే ఆహార పదార్థాలు చాలానే ఉన్నప్పటికి.. శరీరానికి కావలసిన అన్నీ రకాల పోషకాలను సమృద్ధిగా అందించడంలో గుడ్డు మొదటి స్థానంలో ఉంటుంది. గుద్దులో విటమిన్ సి, ఫైబర్ మినహా.. అన్నీ రకాల విటమిన్స్, ప్రోటీన్స్, సమృద్దిగా ఉంటాయి. .

అందుకే డాక్టర్లు సైతం ప్రతిరోజూ కనీసం ఒక్క గుడ్డు అయిన తినాలని చెబుతూ ఉంటారు. అయితే గుడ్డును ఉడకబెట్టి లేదా ఆమ్లెట్ వేసుకొని ఎవరికి నచ్చినటు వారు తింటూ ఉంటారు. కాగా కొందరు అలాగే పచ్చి గుడ్డుకు తాగేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల శరీరం దృఢంగా తయారవుతుందని, కండ బలం పెరుగుతుందని కొందరిలో ఒక అపోహ కూడా ఉంది. అయితే ఇలా పచ్చి గుడ్డి తినడం ఎంత మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. గుడ్డులోని తెల్లసోనలో ‘ ఎవిడిన్ ‘ అనే ఎంజైమ్ ఉంటుంది.

Also Read:మరో స్టార్ హీరోకి విడాకులు

అందువల్ల గుడ్డును పచ్చిగా తాగడం వల్ల ఆ ఎంజైమ్ నేరుగా మన శరీరంలోకి వెళ్తుంది. ఫలితంగా వికారం, వాంతులు, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుటాయి. అంతే కాకుండా గుడ్డులోని పోషకాలను ‘ ఎవిడిన్ ‘ అనే ఈ ఎంజైమ్ మన శరీరానికి అందకుండా చేస్తుంది. అందువల్ల.. గుడ్డును మనం పచ్చిగా తినడం వల్ల ఎలాంటి పోషకాలు మన శరీరానికి అందవని నిపుణులు చెబుతున్నారు. కాగా గుడ్డును ఉడకబెట్టడం వల్ల అందులోని త్రిప్పిన్ అనే మరో ఎంజైమ్ ‘ ఎవిడిన్ ‘ ను విచ్చిన్నం చేస్తుంది. అందువల్ల ఉడకబెట్టిన గుడ్డు తింటే శరీరానికి కావల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయని నిపుణులు చెబుతున్నారు.

 

- Advertisement -