కొనసాగుతున్న శాసనసభ సమావేశాలు

79
kcr

తెలంగాణ శీతాకాల శాసనసభ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. గౌరవ శాసన సభ స్పీకర్‌ మధుసుధనాచారి క్వశ్చన్ అవర్ ద్వారా సభను ప్రారంభించారు. అలాగే శాసన మండలి సమావేశాలను మండలి అధ్యక్షులు ప్రారంభించారు. క్వశ్చన్ అవర్ లో గౌరవ సభ్యులు ప్రజా సమస్యలు..ప్రభుత్వ పాలనపై లేవనెత్తిన అభిప్రాయాలకు..మంత్రులు వాటికి వివరణ ఇస్తున్నారు.

kcr

మిషన్ కాకతీయ పథకం సత్ఫాలితాలు ఇస్తుందన్నారు మంత్రి హరీష్ రావు. వానకాలంలో పడిన వర్షాలకు కాకతీయ మిషన్‌ ద్వారా చేపట్టిన చెరువులు నిండాయాని..వాటి ద్వారా నీటిపారుదల సౌకర్యాలు పెరిగాయన్నారు.  మిషన్ కాకతీయ పనుల్లో అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామన్నారు మంత్రి హరీశ్ రావు. చెరువు పనులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పటికే ఆన్ లైన్ లో పెట్టినట్టు చెప్పారు. మిషన్ కాకతీయ కింద మొదటిదశలో 8 వేల 165 చెరువులను పునరుద్ధరించినట్టు తెలిపారు. రెండో దశలో 9వేల 113 చెరువులను మంజూరుచేయగా.. ఇప్పటి వరకు 1536 చెరువులు పూర్తి చేశామన్నారు. శాసనసభలో టీడీపీ నేత రేవంత్రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్ రావు సమాధానం ఇచ్చారు.

జూన్ 2017 నాటికి రాష్ట్రంలోని అన్ని హై స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్ లు ఏర్పాటు చేస్తామన్నారు  విద్యాశాఖ మంత్రి కడియం  శ్రీహరి. పేద విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం సీఎం కేసీఆర్ ఆహర్నిశలు శ్రమిస్తున్నారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశలో 3 వేల 472 ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ క్లాస్ లు ప్రారంభించామన్నారు.

పేద విద్యార్థులకు కడుపు నిండా అన్నం పెట్టాలన్న సీఎం కేసీఆర్ సంకల్పానికి ప్రతిరూపమే సన్నబియ్యం పథకమని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ఈ బృహత్తర పథకం వివరాలను ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి సభలో వివరించారు. సన్న బియ్యం పథకం అమలులో అక్రమాలను సహించమని, ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. ధాన్యం నిల్వలకు సంబంధించి మండలానికో గోడౌన్ నిర్మించి ఒక్క గిజం కూడా పాడవకుండా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.