ఇవాల్టీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. నేటి నుంచి డిసెంబర్13 వరకు జరగనున్న పార్లమెంట్ సమావేశాలు జరుగనున్నాయి. సెలవులను మినహాయిస్తే మొత్తం 22 రోజులపాటు సభ కొనసాగుతుంది. ఉదయం 11గంటలకు పార్లమెంట్, రాజ్యసభ రెండు ప్రారంభంకానున్నాయి. పౌరసత్వ సవరణ బిల్లు, వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు వంటి మొత్తం 27 బిల్లులను పార్లమెంట్ ముందుకు తీసుకురానుంది కేంద్రం. ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు తదితర సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.
మోదీ నేతృత్వంలోని ఎన్డీయే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న రెండో పార్లమెంట్ సమావేశాలు ఇవి. బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తక్షణ ట్రిపుల్ తలాక్ రద్దు, జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం వంటి పలు కీలక బిల్లులను ఆమోదింపజేసుకున్న సంగతి తెలిసిందే.
పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపనున్న ఉభయ సభలు. శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం 35కు పైగా బిల్లులను ప్రవేశపెట్టనున్నది. ప్రస్తుతం పార్లమెంట్‌లో 43 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో ఏడింటిని వెనక్కి తీసుకోనున్నది. మిగతావాటిలో 12 బిల్లులపై చర్చ, ఓటింగ్ జరుపనున్నది. మరో 27 బిల్లులను సభలో ప్రవేశపెట్టి, చర్చించిన తర్వాత ఓటింగ్ నిర్వహించనున్నది.
winter session of parliament from today