పులికి ఎదురెళ్ళే ధైర్యం… పాతికమందిని మట్టుబెట్టే బలం… గడ్డిపోచగా తీసిపారేసే వాళ్ల గుండెల్లో గడ్డపారలా దిగే తెగువ… ఆకుర్రాడి సొంతం. ఏ పరిస్థితుల్లోనైనా గెలుపే లక్ష్యంగా పోరాడడం… గెలిచి తీరడం అతడి నైజం! మరి, ఆ కుర్రాడి కథేంటోమహాశివరాత్రికి చూడమంటున్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. సాయిధరమ్ తేజ్ హీరోగా ఆయన దర్శకత్వంలో లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘విన్నర్’. బేబి భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధుఈ చిత్రాన్నినిర్మించారు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ కు యుట్యూబ్ లోఅద్భుతమైన స్పందన లభిస్తోంది. 20 లక్షల మంది (టు మిలియన్స్) నెటిజన్లు టీజర్ ను వీక్షించారు.
‘రేయ్.. నువ్వంత ఈజీగా పీకేయడానికి నేనేం గడ్డిపోచని కాదు, గడ్డపారని! దిగిపోద్ది’ అని సాయిధరమ్ తేజ్ చెప్పిన డైలాగ్ తోపాటు ‘పులి ఊరి మీద పడ్డప్పుడు అందరూ పరిగెడతారు. కానీ, ఒక్కడు మాత్రం ఎదురెళతాడు. పట్టుమని పాతికేళ్ళు కూడాఉండవు. కానీ, పెట్టుకున్నారంటే పాతికమందికి పైనే పోతారు’ వంటి డైలాగులకు మంచి స్పందన లభిస్తోంది. ట్రైలర్ లోచూపించిన హార్స్ రేసింగ్ సన్నివేశాలు బాగున్నాయని చూసినవాళ్లు ప్రశంసిస్తున్నారు. టర్కీలో భారీ బడ్జెట్ తో ఈసన్నివేశాలను చిత్రీకరించారు.
హార్స్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 24న అత్యధిక థియేటర్లలో విడుదలకానుంది. ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు ‘నా బీసీ సెంటర్లు..’ అనే పాటను మాస్ మహారాజా ట్విట్టర్లో విడుదలచేయనున్నారు.
దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ – “తనకు జన్మనిచ్చిన తండ్రిని, మనసిచ్చిన అమ్మాయిని గెలవడం కోసం ఓయువకుడు చేసిన పోరాటమే ఈ సినిమా. ‘విన్నర్’ అనే టైటిల్ మా కథకు యాప్ట్. ట్రైలర్ చూసిన వారంతా ఆ మాటేఅంటున్నారు. ఇప్పటివరకూ విడుదలైన పాటలు, ట్రైలర్ కి అద్భుతమైన స్పందన లభించింది. తమన్ చాలా మంచి సంగీతాన్నిచ్చారు. సాయిధరమ్‌తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. అన్ని వర్గాల వారికీ నచ్చేలా సినిమాను తీర్చిదిద్దుతున్నాం” అని అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ – “ప్రస్తుతం చివరి పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ నెల 19న ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగానిర్వహించనున్నాం. మా సినిమాలోని ఒక్కో పాటను ఒక్కో సినీ ప్రముఖుడితో విడుదల చేయిస్తున్నాం. అందులో భాగంగానే సూపర్‌స్టార్ మహేశ్ బాబు ‘సితార సితార..’ అనే పాటను, సమంత ‘పిచ్చోణ్ణే అయిపోయా..’ పాటను, సంగీత దర్శకుడు అనిరుధ్’సూయ సూయ.. అనసూయ..’ పాటను విడుదల చేశారు. ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు మాస్ మహారాజా రవితేజ ‘నాబీసీ సెంటర్లు..’ పాటను విడుదల చేయనున్నారు. మిగతా పాటలను కూడా ఒక్కొక్క సెలబ్రిటీ విడుదల చేస్తారు. తమన్ చాలామంచి సంగీతాన్నిచ్చారు. మా దర్శకుడు చాలా అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా మీద చాలా కాన్ఫిడెన్ట్‌గా ఉన్నాం. మహా శివరాత్రిని పురస్కరించుకుని ఈ నెల 24న సాయిధరమ్‌తేజ్ కెరీర్‌లోనే అత్యధిక థియేటర్లలో చిత్రాన్ని విడుదలచేస్తున్నాం“ అని తెలిపారు.
సాయిధరమ్‌తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, ముకేష్ రుషి, ఆలీ, వెన్నెల కిశోర్ తదితరులుఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, సంగీతం: తమన్, ఆర్ట్: ప్రకాష్, కథ: వెలిగొండ శ్రీనివాస్,మాటలు: అబ్బూరి రవి, నృత్యాలు: రాజు సుందరం, శేఖర్, ఫైట్స్: స్టన్ శివ, రవివర్మ, ఎడిటర్: గౌతమ్ రాజు, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం:గోపీచంద్ మలినేని.