- Advertisement -
ఒకే ఒక కనుసైగతో యువతను తనవైపు తిప్పుకుని రాత్రికి రాత్రే స్టార్ ఇమేజ్‌ను సంపాదించుకున్న బ్యూటీ ప్రియా వారియర్. ఓరు ఆదార్ లవ్ మూవీ ఫ్లాపైన ఈ అమ్మడికి మాత్రం మాంచి పేరొచ్చింది. తాజాగా ఈ భామకు టాలీవుడ్‌లో అదిరిపోయే ఆఫర్ వచ్చింది.
టాలీవుడ్ మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత పూరి జగన్నాథ్ చేస్తున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా ప్రస్తుతం స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్నాడు పూరి.
డిసెంబర్ నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్లనుండగా పక్కా మాస్ సినిమాగా పూరి రూపొందించ బోతున్నట్టు సమాచారం. విజయ్ సరసన ప్రియా ప్రకాష్ నటిస్తుండటంతో మూవీపై మరింత హైప్ క్రియేట్ అయింది. మొత్తంగా పూరి సినిమాతో ప్రియా హిట్ కొడుతుందా లేదా వేచిచూడాలి.
- Advertisement -