- Advertisement -
కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అత్యవసర సేవలు మినహా మిగతా అన్నింటిని ఈనెల 14 వరకు బంద్ చేశారు. తెలంగాణలో ఈ నెల 14 వరకు మద్యం దుకాణాలు, బార్లు మూసే ఉంచాలంటూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు.
నిబంధనలు ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా మద్యం షాపులు నేటి నుంచి తెరువనున్నట్లు సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం జరిగింది. ఈప్రచారాన్ని ప్రభుత్వ అధికారులు ఖండించారు. ఇలా ప్రచారం చేసిన వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మద్యం షాపులను మరికొన్ని రోజులపాటు మూసి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- Advertisement -