విజయ్‌ సేతుపతి..ఉప్పెన

322
uppena
- Advertisement -

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణ‌వ్ తేజ్‌, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా, బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ‘ఉప్పెన’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

త‌మిళ స్టార్ యాక్ట‌ర్ విజ‌య్ సేతుప‌తి ఒక ప్ర‌ధాన పాత్ర పోషిస్తోన్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, షామ్‌ద‌త్ సైనుద్దీన్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌తో క‌లిసి మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి లుక్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. అదరిపోయే లుక్‌తో సినిమాపై అంచనాలను పెంచేశాడు విజయ్‌.

ఇప్పటికే విడుదలైన సినిమాలోని …నీ క‌న్ను నీలి స‌ముద్రం అనే పాట స్వ‌ల్ప‌కాలంలో 10 మిలియ‌న్ వ్యూస్ దాటి, బాగా పాపుల‌ర్ అయిన పాట‌ల్లో ఒక‌టిగా నిలిచింది.

- Advertisement -