ఖాతా తెరవకుండానే నిష్క్రమించిన ఆఫ్ఘాన్‌..

439
wi vs afg
- Advertisement -

ప్రపంచకప్‌లో ఖాతా తెరవకుండానే నిష్క్రమించింది ఆఫ్ఘనిస్తాన్‌. హెడ్డింగ్లే వేదికగా ఆప్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్ 23 పరుగుల తేడాతో విజయం సాదించింది. 312 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘాన్‌ 288 పరుగులు చేసి ఆలౌటైంది. ఆఫ్ఘన్ బ్యాట్స్‌మెన్‌లో అహ్మద్ షా 62, ఇక్రం 86 అస్గర్ 40, షిజాద్ 25 పరుగులు చేశారు. దీంతో ప్రపంచకప్‌లో ఖాతా తెరవకుండానే నిష్క్రమించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. షై హోప్‌ (77; 92 బంతుల్లో 6×4, 2×6), లూయిస్‌ (58; 78 బంతుల్లో 6×4, 2×6), పూరన్‌ (58; 43 బంతుల్లో 6×4, 1×6), హోల్డర్‌ (45; 34 బంతుల్లో 1×4, 4×6) రాణించారు.

ఆఫ్ఘాన్ జట్టు ఓడినా పోరాటంతో ఆకట్టుకుంది. టోర్నీలో విండీస్‌కు ఇది రెండో విజయం కాగా.. అఫ్గాన్‌ అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓడింది. గేల్‌కు ఇదే ఆఖరి ప్రపంచకప్‌ మ్యాచ్‌.

- Advertisement -