న‌ల్గొండ‌లో నిత్య పెళ్ళి కొడుకు ‘విలియ‌మ్స్’..

168
marriage
- Advertisement -

అతడు ఓ చర్చిలో పియానో ప్లేయర్. పియానో ఎంత బాగా వాయిస్తాడో…అమ్మాయిలు, మహిళలను కూడా అదే విధంగా ట్రాప్ చేస్తాడు. ప్రేమ పేరుతో వల విసిరి తర్వాత వారిని మోసం చేస్తాడు.ఇలా 12 మంది మహిళలను మోసం చేసిన కేటుగాడి గుట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నల్గొండ క్లాక్ టవర్ చర్చి లో పియానో వాయించే విలియమ్స్ పై అతడి భార్య తనూజ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనను మోసం చేసి మరో నలుగురు అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.

దీంతో కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టగా దాదాపు పన్నెండు మంది మహుళలను ట్రాప్ చేసి విలియమ్స్ పెళ్లిళ్లు చేసుకున్నట్టు వెల్లడైంది. విలియమ్స్‌ని అరెస్ట్ చేసే క్రమంలో గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేరారు విలియమ్స్‌. చర్చికి వచ్చే యువతులు,మహిళలను మభ్యపెట్టి మోసం చేస్తూ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు విలియమ్స్‌.

- Advertisement -