పవణ్ కళ్యాణ్‌పై తెలంగాణలో కేసు నమోదు

248
case file on Pawan kalyan
- Advertisement -

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ భీమవరం ప్రచారంలో భాగంగా తెలంగాణను పాకిస్ధాన్ లో పోల్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈవిషయం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతుంది. ఆంధ్రవాళ్లను తెలంగాణ వాళ్లు కొడుతున్నారని పవన్ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను చాలా మంది ఖండించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి కూడా పవన్ కు ఘాటుగా రిప్లే ఇచ్చారు. రెండు ప్రాంతాల మధ్య పవన్ విధ్వేషాలు రెచ్చగొడుతున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈసందర్భంగా తాజాగా హైదరాబాద్ లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో పవన్ కళ్యాన్‌ పై ఫిర్యాదు చేశారు టీఆర్ఎస్‌వి అధ్యక్షుడు వి. రాంనరసింహ గౌడ్ .

తెలంగాణ రాష్ట్రాన్ని ఉగ్రవాద దేశమైన పాకిస్థాన్‌తో పవన్ కల్యాణ్ ఎలా పోలుస్తారు? ఆయన మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు లో పేర్కొన్నారు . తెలంగాణ ప్రజలను కించపరిచేలా మాట్లాడారంటూ ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఏమైనా పాకిస్థాన్ అనుకుంటున్నారా మాకు పౌరుషం లేదా. ఆంధ్ర ప్రజలమైన మనమీద తెలంగాణా వాళ్లు దాడులు చేస్తున్నారు అని భీమవరం సభలో పవన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. . అంతేకాకుండా త్వరలో జరిగే ఎన్నికల్లో ఎపీ ప్రజల మన్నెనలు పొందేందుకు పవన్ కళ్యాణ్‌ తెలంగాణపై ఇలా మట్లాడటం సరికాదని తెలంగాణ అడ్వకేట్ జేఏసినేతలు జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈకేసులపై పవన్ కళ్యాణ్ ఏవిధంగా స్పందిస్తాడో చూడాలి.

- Advertisement -