త్రివిక్రమ్ బన్నీ మూవీలో “కాలా” విలన్

253
nana patekar
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ మూవీకి సిద్దమవుతున్నాడు. చాలా రోజులుగా బన్నీ ఖాళిగా ఉన్న విషయం తెలిసిందే. నాపేరుసూర్య నా ఇల్లు ఇండియా సినిమా తర్వాత ఇప్పటివరకూ బన్నీ షూటింగ్ లో పాల్గోనలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ తర్వలోనే ప్రారంభం కానుందని తెలుస్తుంది. ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, చినబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీస్థాయిలో నిర్మితంకానున్న ఈ సినిమా కోసం స్టార్ నటీనటుల్ని ఎంపిక చేసుకుంటున్నారు త్రివిక్రమ్. ఈసినిమాలో కూడా నాన్న సెంటిమెంట్ ఉండనుందని సమాచారం. అయితే ఈసినిమాలో కీలకమైన పాత్రల్లో సీనియర్ నటులను తీసుకొవాలనే ఆలోచనలో ఉన్నాడట త్రివిక్రమ్.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రతి సినిమాలో ఏవరొ ఒకరు సీనియర్ నటులు ఉంటారన్న విషయం తెలిసిందే. ఈమూవీలో బన్నీ తల్లి పాత్ర కోసం టబును తీసుకోవాలని చూస్తున్నారట. అయితే ఈసినిమా లో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడిని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట దర్శకుడు త్రివిక్రమ్. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ అయితే ఈ పాత్రకు సరిగ్గా షూట్ అవుతారని అనుకుంటున్నారట. త్వరలోనే త్రివిక్రమ్ నానా పటేకర్ ను కలవనున్నారని తెలుస్తుంది. ఈమద్యే ‘కాల’ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు నానా పటేకర్ . ఇప్పటివరకూ నానా పటేకర్ తెలుగు సినిమాల్లో నటించలేదు. చూడాలి మరి త్రివిక్రమ్ ఆయన్ను ఎలా మెప్పిస్తారో.

- Advertisement -