యువరాజ్ సింగ్. ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదిన టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్‌గా అందరికి సుపరిచితులు. ఆయన ప్రస్తుతం ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ తరపున ఆడుతున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ఫార్మాట్‌తో సంబంధం లేకుండా నేను 2019 వరకు క్రికెట్ ఆడాలనుకుంటున్నాను. వచ్చే సంవత్సరం ఇంగ్లాండ్, వేల్స్‌లో ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీలో ఆడేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్నానంటూ, వచ్చే ఏడాది ప్రపంచకప్ తర్వాత ఇక క్రికెట్‌లో కొనసాగుతానా? లేదా? అన్న విషయంపై క్లారిటీ ఇస్తానని యూవీ చెప్పారు.
యూవీ మాట్లాడుతూ..గత పది పద్దెనిమిదేళ్ల నుంచి క్రికెట్‌లో రాణిస్తున్నానని కానీ ప్రతి క్రికెటర్ ఎప్పుడు ఒకప్పుడు క్రికెట్‌కు దూరం కావాల్సిందేనన్నారు. అందకు నేను కూడా వచ్చే 2019 అనంతరం నేను కూడా ఆడతానా? లేదా అన్న విషయంపై స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. ఆనంతరం యూవీ ఐపీఎల్ గురించి మాట్లాడారు. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మంచి ఆట తీరుతో ప్రతిభను కనబరుస్తున్నాయన్నారు.
ప్రస్తుతం మా దృష్టి లీగల్ మ్యాచులు ముగిసే లోపు తుది నాలుగు జట్లలో మా టీమ్ చోటు దక్కించుకోవాడంపై ఉందని ఆయన తెలిపారు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్సుడు మా టీమ్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ చాలా బాగా ఉందని ఆయన తెలిపారు. ఇక క్రికెటర్ గేల్ గురించి ప్రస్తావిస్తూ అతనొక భయంకరమైన బ్యాట్స్‌మెన్ అని, అతని ఆట తీరు అద్భుతమని కొనియాడారు. మేమిద్దరం మంచి స్నేహితులమని కూడా చెప్పకొచ్చారు యూవరాజ్ సింగ్.