ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికుల మధ్య చర్చలు జరగాలన్నారు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు. కార్మికుల ఆత్మహత్యలు తనను బాధించాయని చిట్ చాట్‌లో వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని కలిసి చర్చలు జరపాలని సూచించారు.
సమ్మెతో పరిస్థితులు చేజారి పోతున్నాయనే అనుమానం వచ్చిందని…ప్రెస్ రిలీజ్ కు ముందుగాని, తర్వాత గానీ సీఎం కేసీఆర్ తో తాను మాట్లాడలేదని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా…ఆయన అందుబాటులోకి రాలేదన్నారు.
తాను ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో ఆర్టీసీ కార్మికుల ఆశలు పెరిగాయన్నారు. అయితే తాను చర్చలు జరుపుతానని అనలేదు. ఐనా సరే, మంచి జరుగుతుందని అనుకుంటే మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్దం. సీఎం ఆదేశిస్తే ఖచ్చితంగా చర్చలకు దిగుతానని స్పష్టం చేశారు.
ఇది పార్టీ సమస్య కాదు, ప్రభుత్వ సమస్య. కార్మికులు నాతో చర్చలకు సానుకూలంగా వుండటం మంచి పరిణామం అన్నారు. తాను సోషలిస్టును. రాజ్యం వైపు ఎప్పుడూ ఉండను. కార్మికుల వైపే ఉంటానని తేల్చిచెప్పారు.