చెర్రీని చంపి తారక్‌తో లేచిపోతా.. ప్రభాస్‌తో పెళ్లి..!

429
- Advertisement -

గతకొంత కాలంగా నటి మంచు లక్ష్మీ హోస్ట్‌గా చేస్తున్న టాక్ షో “ఫీట్ అప్ విత్ స్టార్స్” గురించి వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఆమె సెలబ్రెటీల నుండి బోల్డ్ సమాధానాలను రాబడుతూ వారి సీక్రెట్‌లను కెమెరా ముందు ఆవిష్కరిస్తుంది. ఇప్పటికే పలువురు స్టార్స్ ను తన షో లో ఇంటర్వ్యూ చేసిన ఈ అమ్మడు ఇటీవల సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్‌ను ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్బంగా పలు ఆసక్తికర విషయాలను కాజల్ నుండి మంచు లక్ష్మి రాబట్టడంలో సక్సెస్ అయ్యింది.

kajal

ఇందులో భాగంగా.. కాజల్ అగర్వాల్‌తో మంచు లక్ష్మీ… రామ్‌చరణ్‌, తారక్‌, ప్రభాస్‌లలో ‘ఎవరిని చంపుతారు? ఎవరితో రిలేషన్‌లో ఉంటారు? ఎవరిని పెళ్లి చేసుకుంటారని ప్రశ్నించగా, కాజల్ స్పందిస్తూ.. రామ్‌ చరణ్‌ను చంపేస్తానని, ఎన్టీఆర్‌తో రిలేషన్‌లో ఉంటానని, ప్రభాస్‌ను మాత్రం పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు పెళ్లి అవడంతో ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ ఒక్కరు కావడంతో ప్రభాస్‌నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది చందమామ.

అంతేకాదు కాజల్‌కు ఇష్టమైన హీరో ఎవరని అడగ్గా.. నా కెరీర్ లో ఇష్టమైన హీరో రానా. ఆయనతో వర్క్ చేయడానికి చాలా ఇష్టపడతాను. రానాతో పని చేయడం చాలా ఫన్నీగా ఉంటుంది అలాగే చాలా కష్టంగా కూడా ఉంటుంది. అయితే రానా నన్ను చాలా బాగా చూసుకుంటాడు. అందుకే ఆయన ఇష్టమైన హీరో అంది. నేను ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా నాతో పాటు ఒక చిన్న దేవుడి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం నాతో ఉంటే ఇంట్లో ఉన్నట్లుగానే అనిపిస్తుంది.

- Advertisement -