- Advertisement -
కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఒక్కసారిగా తగ్గడం ప్రారంభించింది. సగటు వినియోగదారుడికి కాస్త అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. బంగారం ఇప్పుడు ఆరువారాల కనిష్ట స్థాయికి చేరుకుంది. దీనికి కారణాలు ఏంటి? పసిడి ధర వరుసగా నాలుగో రోజు తగ్గుముఖం పట్టింది.
ఒక్క రోజులో రూ. 300 తగ్గింది. దీంతో పది గ్రాముల బంగారం ధర రూ. 28,100కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం, స్థానిక వ్యాపారుల గొనుగోళ్లు మందగించడంతో బంగారం ధర తగ్గినట్లు బులియన్ మార్కెట్లు వెల్లడించాయి.
బంగారం ధర తగ్గడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ప్రస్తుతానికి యధాతథంగా ఉన్నప్పటికీ జూన్‌లో పెరగడం ఖాయమని మార్కెట్ వర్గాలు అంచనా వేయడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు.
- Advertisement -