బంగారు భార‌త‌దేశాన్ని త‌యారు చేసుకుందాం- సీఎం కేసీఆర్‌

103
- Advertisement -

జహీరాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి, ఆందోల్ నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసే, దాదాపు 3,90,000 ఎకరాలకు సాగు నీరు అందించడానికి రూ. 4,427 కోట్లతో నిర్మించనున్న సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం నారాయణ ఖేడ్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. మీ అందరి దీవెనలతోనే తెలంగాణ సాధించుకున్నాం.. నిన్న మ‌హారాష్ట్ర‌లో సీఎం ఉద్ధ‌వ్ థాక‌రే అడుగుతున్న‌రు. మీరు రైతు బంధు ఇస్తున్నార‌ట‌. మీరు రైతు బీమా ఇస్తున్నార‌ట‌. బార్డ‌ర్ వాళ్లు తెగ ఇబ్బంది పెడుతున్న‌రు. ఎట్లా ఇస్తున్నారో కాస్త చెప్పండి. మేము కూడా స్టార్ట్ చేస్తం అని అడిగారు. అందుకే.. తెలంగాణ‌లో జ‌రిగే ప‌నులు దేశ‌వ్యాప్తంగా జ‌ర‌గాల‌ని దేశం కోరుతోంది. దేశం గురించి మ‌నం కూడా కొట్లాడాలి. బంగారు తున‌క లాంటి తెలంగాణ‌ను చేసుకోవాలి.. అని సీఎం కేసీఆర్ వెల్ల‌డించారు.

నేను జాతీయ రాజ‌కీయాల్లో కూడా పోయి మాట్లాడుతున్నా. ప‌ని చేస్తా ఉన్నా. పోదామా మారి.. జాతీయ రాజ‌కీయాల్లోకి. ఢిల్లీ దాక కొట్లాడుదామా? భార‌త‌దేశాన్ని బాగు చేద్దామా. ఎట్ల తెలంగాణ‌ను బాగు చేసుకున్నామో.. అదే ప‌ద్ధ‌తిలో భార‌త‌దేశ రాజ‌కీయాల్లో కూడా ప్ర‌ముఖ పాత్ర పోషించాలి. త‌ప్పుకుండా ఈ దేశాన్ని అమెరికా కంటే గొప్ప దేశంగా త‌యారు చేయాలి. మ‌నం అమెరికా పోవ‌డం కాదు.. ఇత‌ర దేశాలే వీసాలు తీసుకొని మ‌న దేశానికి వ‌చ్చే ప‌రిస్థితి చేసేంత గొప్ప సంప‌ద‌, వ‌నరులు, యువ‌శ‌క్తి ఈ దేశంలో ఉన్న‌ది. కాబ‌ట్టి నేను పోరాటానికి బ‌య‌లుదేరా. బంగారు తెలంగాణ‌ను ఎలా త‌యారు చేసుకున్నామో.. బంగారు భార‌త‌దేశాన్ని కూడా త‌యారు చేసుకుందాం.. అని స్ప‌ష్టం చేశారు.

- Advertisement -