సౌత్ రాష్ట్రాలే టార్గెట్ గా బీజేపీ కొత్త వ్యూహాలకు పదును పెడుతోందా ? ప్రస్తుతం బీజేపీ దృష్టంతా సౌత్ ఏపీ, తెలంగాణపైనే ఉందా ? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కర్నాటక ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత బీజేపీకి తెలంగాణ మరియు ఏపీలో సత్తా చాటడం అనివార్యం అయింది. లేదంటే సౌత్ లో బీజేపీ కనుమరుగయ్యే అవకాశం ఉంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ మరియు ఏపీలో పార్టీని బలపరచాలని కాషాయ పెద్దలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం అన్నీ రకాలుగా వ్యూహాలను అమలు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో సినీ స్టార్ల ప్రభావం గట్టిగా ఉంటుంది.
అందుకే బీజేపీ సినిమా స్టార్ల ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్లాన్ చేస్తోంది. గతంలో జూ. ఎన్టీఆర్, చిరంజీవి, నితిన్, వంటి హీరోలతో భేటీ అయి చర్చలు కూడా జరిపారు. కానీ ఆ తరువాత ఏమైందో తెలియదు గాని.. ఆ సమావేశాల వెనుక అసలు కారణాలు ఏంటి అనేది ఇప్పటికీ కూడా బయటకు రాలేదు. ఇక మరోసారి సినీ ప్రముఖులతో సమావేశాలను ప్లాన్ చేస్తున్నారు కమలనాథులు. తెలంగాణకు రాబోతున్న అమిత్ షా.. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, ప్రభాస్ లను కలవబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా అమిత్ షా నేడే తెలంగాణ కు రావాల్సి ఉండగా.. గుజరాత్ లోని తుఫాన్ కారణంగా ఆయన తెలంగాణ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: CMKCR:తెలంగాణ ప్రజల ఆకాంక్షల నిర్మాణం
ఇదిలా ఉంచితే ఇలా వరుసబెట్టి సినీ ప్రముఖులతో బీజేపీ అధిష్టానం భేటీ కావడం వెనుక రాజకీయ వ్యూహం ఉందనేది కొందరి మాట. తెలంగాణలో మరో అయిదు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఏపీలో కూడా మరో పది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలకు సినీ ప్రముఖులచే బీజేపీకి ప్రచారం చేయించేందుకు కాషాయ పార్టీ అధిష్టానం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా తెలంగాణలో బీజేపీకి కొంత బలం ఉన్నప్పటికి.. ఏపీలో మాత్రం అసలు బలమే లేని పరిస్థితి ఈ నేపథ్యంలో సినీ హీరోలతోనూ, ప్రముఖులతోనూ ఎంత ప్రచారం చేయించిన వ్యర్థమే అనేది కొందరి మాట. మరి బీజేపీ సినీగాలం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
Also Read: పవన్ విజయ యాత్ర.. లక్ష్యమదే !