వీధి కుక్కల దాడులకు జంతు ప్రేమికులు బాధ్యత వహిస్తారా? అని సుప్రీం కోర్టు నిలదీసింది. వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ విచారిస్తూ, జంతు ప్రేమికులను ప్రశ్నించింది సుప్రీం.
ప్రజలు వీధి కుక్కల భయం లేకుండా స్వేచ్చగా రోడ్డు మీద తిరగాలని గత ఏడాది నవంబర్ 7వ తేదీన వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు .
సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ జంతు ప్రేమికులు దాఖలు చేసిన పిటిషన్ విచారిస్తూ, వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఇచ్చిన తీర్పును ఉపసంహరించుకోమని తేల్చి చెప్పారు న్యాయమూర్తి .
Also Read:హైపర్ టెన్షన్..‘సైలెంట్ కిల్లర్’!
వీధి కుక్కల వల్ల ఎవరికైనా నష్టం కలిగినా, ఎవరిపైనైనా దాడులు చేసినా న్యాయ పరమైన బాధ్యత జంతు ప్రేమికులు తీసుకుంటారా…జంతు హింస నిరోధక చట్టం ప్రకారం రేబీస్ సోకిన, ప్రమాదకరంగా ఉన్న కుక్కల కారుణ్య మరణాలకు కూడా అనుమతులు ఇచ్చింది సుప్రీం కోర్టు.

