ఇప్పుడేందుకు.. సమైక్యాంధ్ర ?

309
- Advertisement -

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో సమైక్యాంధ్రను గూర్చిన చర్చ జోరుగా జరుగుతోంది. ఎందుకంటే ఇటీవల ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాలు మళ్ళీ కలవాలని, కలిస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా ఈ అంశంపై హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. అసలు ఇప్పుడేందుకు ఈ సమసిపోయిన అధ్యాయాన్ని మళ్ళీ తెరపైకి తెస్తున్నారు. ఇందులో ఏపీ ప్రభుత్వం ఎందుకు చోరువ చూపిస్తోంది ? ఏపీ ప్రభుత్వం ఆశించినట్లుగా రెండు తెలుగు రాష్ట్రాలు మళ్ళీ కలిసే అవకాశం ఉందా ? ఇలాంటి ప్రశ్నలు పోలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తున్నాయి. కాగా ఏపీలో ప్రస్తుతం జగన్ సర్కార్ పై అవినీతి ఆరోపణలు గట్టిగానే చక్కర్లు కొడుతున్నాయి. .

ముఖ్యంగా ఏపీలో అభివృద్ది కొరత ఏర్పడిందని ప్రతిపక్షాలు గట్టిగానే విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టి ని మళ్లించేందుకే సజ్జల మళ్ళీ సమైక్యాంధ్ర అంశాన్ని తెరపైకి తెచ్చారని ఇన్ సైడ్ టాక్. కాగా ఏపీ ప్రభుత్వ నేతలు తెరపైకి తెచ్చిన ఈ సమఖ్యాంద్ర అంశాన్ని తెలంగాణ మాత్రం గట్టిగా ఖండిస్తున్నారు. ప్రజాస్వామ్య బద్దంగా విడిపోయిన రాష్ట్రాలు మళ్ళీ ఎలా కలుస్తాయని ప్రశ్నిస్తున్నారు. విడిపోయిన రాష్ట్రాలు మళ్ళీ కలవడం అనేది తెలివి తక్కువ వాదన అని, అలా అయితే ఏపీ తమకు కావాలని మద్రాస్ అడగొచ్చని, అలాగే ఇండియా తమకు కావాలని ఇంగ్లండ్ కూడా తిరిగి అడుగుచ్చని ఎద్దేవా చేశారు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి. ఇక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు శర్మిల మరియు బిజెపి నేతలు కూడా ఏపీ ప్రభుత్వ నేతలు లేవనెత్తిన సమైఖ్యాంధ్ర అంశాన్ని గట్టిగానే ఖండిస్తున్నారు.

ఇక ప్రజలు కూడా అనవసరమైన అంశాన్ని ఏపీ ప్రభుత్వం ఎప్పుడేందుకు తెరపైకి తెస్తోందని ప్రశ్నిస్తున్నారు. కాగా ఏపీ ప్రభుత్వ నేతలు ఆశించినట్లుగా రెండు రాష్ట్రాలు మళ్ళీ కలిసే అవకాశం ఉందా అంటే ఏమాత్రం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు కూడా పరిపాలన పరంగా దేనికవే అన్నట్లుగానే ఉన్నాయి. ఆర్థిక పరంగా అలాగే వనరుల పరంగా తెలంగాణ బలమైన రాష్ట్రంగా రూపుదిద్దుకుంటోంది. ఈ నేపథ్యంలో తిరిగి ఆంధ్రలో కలిసేందుకు తెలంగాణ ఏమాత్రం సిద్దంగా ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కేవలం రాజకీయ లబ్ది కోసం తెరపైకి తెచ్చిన అంశమే అని విశ్లేషకులు కొట్టి పారేస్తున్నారు. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాలలో ఏపీ ప్రభుత్వ నేతలు లేవనెత్తిన సమైఖ్యాంధ్ర అంశం హాట్ హాట్ డిబేట్లకు కారణం అవుతోంది.

ఇవి కూడా చదవండి…

పీకల్లోతు అప్పుల్లో బిజెపి రాష్ట్రాలు

ఆంధ్రాలో వెలిసిన ఫ్లెక్సీలు….

ఆ 144 ఎంపీ స్థానాలపై బీజేపి గురి….

- Advertisement -