కాంగ్రెస్‌లోకి ప్రభు..!

201
Actor prabhu
- Advertisement -

ప్రముఖ సినీ నటుడు ప్రభు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. రాహుల్ తమిళనాడు పర్యటన సందర్భంగా ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. చెన్నైలోని శివాజీ గణేశన్ ఇంటికి వెళ్లి, ఆయన చిత్ర పటానికి నివాళి అర్పించనున్నారు రాహుల్ . ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ప్రభు చేరనున్నట్లు టాక్.

తండ్రి శివాజీ గణేశన్ నుంచి సినీ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ప్రభు… సినీ రంగంలో అంతగా రాణించలేకపోయారు. ఈ నేపథ్యంలో, రాజకీయాల్లోకి రావాలని ఆయన భావిస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పక్కా ప్లాన్‌తో త్వరలో రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు.

శివాజీ గణేశన్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే నటి ఖుష్బూ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ప్రభు, ఖుష్బూల మధ్య తొలి నుంచి కూడా మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ప్రభు రాకతో కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

- Advertisement -