మహేష్ మూవీకే ఎందుకిలా.. ?

29
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ” గుంటూరుకారం “. ఇప్పటికే సగ భాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రంపై వచ్చినన్ని రూమర్స్ మరే సినిమాకు రాలేదనే చెప్పాలి. ఎప్పుడో అనౌన్స్ అయి సెట్స్ పైకి వెళ్ళిన ఈ చిత్రం.. ఆ తరువాత కథ విషయంలో మహేశ్ మార్పులు కోరాడని కొంత కాలం వాయిదా పడింది. ఆ తరువాత మహేష్ తండ్రి, తల్లి మరణించడంతో మరోసారి షూటింగ్ కు బ్రేక్ పడింది. ఆ తరువాత మొదటి కథ మహేశ్ కు అసలు నచ్చకపోవడంతో మరొ కథను త్రివిక్రమ్ రెడీ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అడ్డంకులు ఈ సినిమాకు ఎదురవుతూనే ఉన్నాయి.

ఇక తాజాగా ఈ మూవీ నుంచి థమన్ తప్పుకున్నడంటూ ఫిల్మ్ నగర్ లో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. థమన్ ట్యూన్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మహేశ్ కు నచ్చకపోవడంతో థమన్ ప్లేస్ లో అనిరుధ్ ని తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే చిత్రా యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో ఇవి రూమర్సా లేదా నిజలా అనేది తెలియక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. ఇక తాజాగా ఈ మూవీ నుంచి మెయిన్ హీరోయిన్ పూజా హెగ్డే తప్పుకున్నట్లు మరో రూమర్ చక్కర్లు కొడుతోంది. మూవీ షూటింగ్ లేట్ అవుతుండడంతో డేట్స్ ఇష్యూ వల్ల పూజా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట.

Also Read: ‘దేవ‌ర’ కీల‌క షెడ్యూల్ పూర్తి

ఇప్పటికే పూజా హెగ్డే పై కొంత భాగం చిత్రీకరణ కూడా జరిగింది. ఇప్పుడు పూజా ప్లేస్ లో శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా చేయనుందట. మరో హీరోయిన్ గా సంయుక్త మీనన్ కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే వైరల్ అవుతున్న వార్తలపై చిత్రా యూనిట్ గాని నటి నటులు గాని ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇవన్నీ ఒట్టి రుమార్సే అని కొట్టి పారేస్తున్నారు కొందరు. అయితే మహేశ్ బాబు సినిమాకే ఎందుకిలాంటి రూమర్స్ తెరపైకి వస్తున్నాయని ఆయన అభిమానులు కొంత అసంతృప్తికి గురౌతున్నారు. ఇక ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. మరి ఎన్నో రూమర్స్ మధ్య గుంటూరుకారం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Also Read: చరణ్ ప్లాన్ అదుర్స్.. పోటీ లేకుండా

- Advertisement -