సుప్రీం తీర్పుపై వర్మ సెటైర్‌..

212
ram gopal
- Advertisement -

సమకాలీన అంశాలపై తన స్పందనను కాస్త వివాదాస్పదంగా తెలియజేసే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఈ సారి ఏకంగా సుప్రీం కోర్టునే టార్గెట్‌ చేశాడు. సినిమా థియేటర్లలో ఇకపై చిత్ర ప్రదర్శనకు ముందు కచ్చితంగా జాతీయగీతం ఆలపించాల్సిందే అని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై వర్మ ఓపెన్‌గానే విమర్శలు చేశాడు.  ‘జాతీయగీతాన్ని సినిమా హాల్స్‌కు మాత్రమే ఎందుకు పరిమితం చేయాలి. ఏదైనా షాప్‌లోకి ప్రవేశించే ముందు కూడా కస్టమర్లు జాతీయగీతం వీడియో చూసి లోపలికి రావాలని పాన్‌షాప్‌ వాళ్లు ఎందుకు చెప్పకూడదు’ అని ట్వీటేశాడు వర్మ.

ram gopal

ఇప్పటి వరకు మెగా హీరోలపై, సెన్సార్‌ బోర్డు సభ్యులపైనే ఎక్కువగా తన ట్వీట్టాస్ట్రాన్ని ఎక్కుపెట్టిన వర్మ ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టు నిర్ణయాన్నే విమర్శించడం చర్చనీయాంశంగా మారింది. అయితే వర్మ కామెంట్‌ను కొంత మంది సపోర్ట్ చేస్తుంటే..ఇంకొందరేమో వర్మ కు పిచ్చి బాగా ముదిరిపోయింది అంటూ సెటైర్లు వేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మతో పాటు..ఇంకొంతమంది బాలీవుడ్ తారలు కూడా సుప్రీం నిర్ణయాన్ని ప్రశ్నించారు. థియేటర్లలోనే ఎందుకు..పార్లమెంట్‌ లో ఎందుకు జాతీయ గీతాన్ని ఆలపించ కూడదంటూ మనసులోని మాటను వెలిబుచ్చారు.

- Advertisement -