సోషల్‌ మీడియాలో కొత్త వెయ్యి నోటు…

250
- Advertisement -

నోట్ల రద్దుతో నేటి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. రూ.2000నోటుకు చిల్లర ఎక్కడ దొరకపోవడంతో చిల్లర కష్టాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. కొత్త రూ.500నోటు చుట్టం చూపుగా వచ్చినట్లే వచ్చి వెళ్లిపోయింది….ఎక్కడకూడా రూ.500నోటు ప్రస్తుతం కనపించడం లేదు. ప్రస్తుతం పెరుగుతున్న చిల్లర కష్టాలకు కేంద్రం చెక్‌ పెట్టే ఆవకాశాలు కనిపిస్తున్నాయి.

 new rs.1000 currency note

ఇప్పుడు సోషల్‌ మీడియాలో కొత్త రూ.1000 నోటు చక్కర్లు కొడుతుంది. లేత నీలం రంగులో ఉన్న ఈ నోటుపై గాంధీ ఫొటో ఉంది. రద్దైన తర్వాత వచ్చిన రెండు వేల రూపాయలు, ఐదొందల రూపాయల నోట్లను పోలి ఉండటంతో అంతా నిజమైనదేనని అనుకుంటున్నారు. గతంలో పెద్ద నోట్ల రద్దుకు ముందే రెండు వేల రూపాయల నోటు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన విషయం అందరికి తెలిసిందే. మొదట్లో దాన్నెవ్వరూ ఆనోట్లను సీరియస్‌గా తీసుకోలేదు. కానీ ఆ తర్వాత అదే నిజమైంది. కొత్త రెండు వేల రూపాయల నోటు విషయంలో ఎలా జరిగిందో ప్రస్తుతం కొత్త వెయ్యి రూపాయల నోటు విషయంలో కూడా జరగవచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే కేంద్ర ఆర్థిక శాఖ కానీ, రిజర్వ్ బ్యాంక్ కానీ అధికారికంగా చెప్పేదాకా కొత్త వెయ్యి నోటుపై పుకార్లను నమ్మవద్దని ఆర్బీఐ అధికారులు చెబుతున్నారు.

 new rs.1000 currency note

రద్దైన రూ.1000నోటు స్థానంలో కొత్త డిజైన్ తో కూడిన వెయ్యి నోటును మార్కెట్లోకి తీసుకొస్తున్నట్టుగా ఇటీవలే ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త వెయ్యి నోట్లకు సంబంధించి గ‌త రెండు మూడు నెల‌లుగా కసరత్తులు జరుగుతున్నాయని, మరికొద్ది నెలల్లో కొత్త వెయ్యి నోటు మార్కెట్లోకి వస్తుందని శక్తికాంత్ తెలిపారు. ఇదివరకు ఉన్న కలర్ కాకుండా, కొత్త కలర్ తో పాటు కొత్త లుక్ తో నోటును ముద్రిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆర్బీఐకి చెందిన కేవలం ఇద్దరు ముగ్గురు అధికారులు పర్యవేక్షణలోనే కొత్త వెయ్యి నోట్ల ప్రక్రియ జరుగుతున్నట్టుగా ఆయన తెలియజేశారు.

 new rs.1000 currency note

ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ చెప్పినట్లుగానే ఈ నోటు కనిపిస్తుందని సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ కొత్త రూ.1000నోటు మార్కెట్‌ లోకి వస్తే చిల్లర కష్టాలు తీరుతాయని చిరు వ్యాపారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి కొత్త రూ.1000నోటు వస్తుందో లేదో వెచిచూడాల్సిదే.

- Advertisement -