NBK:బాలయ్య అంటే అంత చులకనెందుకు?

43
- Advertisement -

తెలుగు దేశం పార్టీకి ప్రస్తుతం తెలంగాణలో నాయకుడు కరువయ్యాడు. నిజానికి మొన్నటి వరకూ జూనియర్ ఎన్టీఆర్ పై తెలుగుదేశం అభిమానులు, చంద్రబాబు అభిమానులు ఓ రేంజ్ లో ఎగిరిపపడ్డారు. కానీ ఇప్పుడు వారి పై బాలయ్య అభిమానులు ఎగసిపడుతున్నారు. చంద్రబాబు నాయుడికి ఎన్టీఆర్ మద్దతు ఇవ్వలేదు, కానీ బాలయ్య అండగా నిలబడ్డారు. బాబు జైల్లో ఉంటే ఎన్టీఆర్ స్పందించలేదు అని అందరూ తారక్ ను తిట్టారు. బాలయ్య కూడా ఓ రేంజ్ లో ఐ డోంట్ కేర్ అంటూ రెచ్చిపోయారు. పైగా ఇక పార్టీలో తాను యాక్టివ్ అవుతా అంటూ అభయం ఇచ్చాడు.

దీనికి తోడు, బాలయ్య భగవంత్ కేసరి సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది. ఇంకేం ఉంది ?, బాలయ్య రాజకీయాల్లో కూడా సూపర్ హిట్ కొడతారు అంటూ ఆయన అభిమానులు ఆశ పడ్డారు. కానీ బాలయ్యను తొక్కేశారు బాబు. బాలయ్యను పార్టీ మీటింగ్ లకు కూడా పిలవొద్దు అంటూ బాబు ఆదేశాలు జారీ చేశాడట. పాపం నిజంగా ఇది బాలయ్యకి అవమానమే. దీంతో బాబు పై బాలయ్య ఫాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అసలు బాలయ్య అంటే అంత చులకన ఎందుకు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కానీ, బాలయ్య ఫాన్స్ మాత్రం బాబుకి కావలసినప్పుడు బాలయ్య స్పందించాలి. కానీ, కీలక నిర్ణయాల సమయంలో మాత్రం బాలయ్య ని పక్కనపడేస్తారు, తెలుగు దేశం కుటుంబం అస్సలు బాలయ్యను పట్టించుకోదు.. అలాంటప్పుడు బాలయ్య ఇక ఎందుకు పార్టీ కోసం పని చేయాలి ? అంటూ మెసేజ్ లు చేసున్నారు. మరి బాలయ్య మాత్రం ఎలాంటి రియాక్షన్ లేకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.

Also Read:మ్యూజికల్ ప్రమోషన్స్‌లో ‘సైంధవ్’

- Advertisement -