రాష్ట్రం అంతా సిద్దిపేట వైపు చూస్తోందిః జెడ్పీ చైర్మన్

601
zp roja sharma
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం మొత్తం సిద్దిపేట వైపు చూస్తోందన్నారు సిద్దిపేట్ జిల్లా జెడ్పీ చైర్మన్ రోజా శర్మ. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ భవన్ లో జెడ్పీ చైర్మన్ రోజా శర్మ ఆధ్వర్యంలో జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం జరిగింది . ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు రామలింగా రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ వెంకట్ రాంరెడ్డి, జిల్లా జెడ్పీటీసీ సభ్యులు, జిల్లా అధికారులు హాజరయ్యారు.

ఈసందర్భంగా జెడ్పీ చైర్మన్ రోజా శర్మ మాట్లాడుతూ.. గతంలో గ్రామాల్లోకి వెళ్ళితే చెత్తాచెదారం విచ్చలవిడిగా కనిపించేది. కానీ నేడు ప్రభుత్వం చేపట్టిన 30రోజుల ప్రణాళిక అనంతరం పచ్చని చెట్లతో రహదారులు స్వాగతం పలుకుతున్నాయి. రాష్ట్రం మొత్తం సిద్దిపేట వైపు చూసేలా అభివృద్ది చేసుకున్నాం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే గ్రామాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గత సమావేశంలోనీ సమస్యలను దశలవారీగా పరిష్కరించుకుందాం. సిద్దిపేట జిల్లాను రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా మార్చేందుకు అందరూ సహకరించాలని కోరారు.

- Advertisement -