ఎలక్షన్ రిపోర్ట్ : కొల్లాపూర్ కింగ్ ఎవరో?

48
- Advertisement -

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజికవర్గానికి రాజుల చరిత్ర ఉంది. గతంలో ఈ ప్రాంతాన్ని దశాబ్దాల పాటు సురబీ వంశీయులు పరిపాలిస్తూ వచ్చారు. ఇప్పటికీ ఇక్కడ ఉన్న ఎన్నో పురాతన కట్టడాలు కొల్లాపూర్ పూర్వపు చరిత్రను చెప్పకనే చెబుతాయి. 1952 లో కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడిన తరువాత ఎనిమిది సార్లు కాంగ్రెస్, మూడు సార్లు స్వతంత్ర అభ్యర్థులు, ఒక్కో సారి టీడీపీ, సిపిఐ, బి‌ఆర్‌ఎస్ ( టి‌ఆర్‌ఎస్ ) గెలుపొందాయి. ఈసారి ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలుపొందిన బీరం హర్షవర్ధన్ రెడ్డి.. ఆ తరువాత బి‌ఆర్‌ఎస్ లో చేరారు.

వచ్చే ఎన్నికల్లో కూడా బీరంకే టికెట్ కేటాయించింది బి‌ఆర్‌ఎస్ అధిష్టానం. ఇక గత ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ నుంచి బరిలోకి దిగి ఓటమిపాలు అయిన జూపల్లి కృష్ణారావు ఈసారి కాంగ్రెస్ గూటికి చేరారు. హస్తం పార్టీ తరపున కొల్లాపూర్ టికెట్ జూపల్లి కృష్ణరావుకే కేటాయించే అవకాశాలు ఉన్నాయి. అటు బీజేపీ నుంచి ఈ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేయబోతున్నారనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. మరి కొల్లాపూర్ లో గెలిచి నిలిచే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

Also Read:దేశమంతా తెలంగాణ వైపే!

ఈ నియోజకవర్గంలో ఏడు మండలాలు 133 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని చోట్ల కూడా బీరం హర్షవర్ధన్ రెడ్డికి మంచి ప్రజాదరణ ఉంది. అయితే గతంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన జూపల్లి కృష్ణరావు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే గత ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. కాగా గత కొన్నాళ్లుగా నియోజక వర్గంలో జూపల్లి పై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతూ వస్తుంది. ఈ కారణం చేతనే ఆయనను అధికార బి‌ఆర్‌ఎస్ నిరభ్యంతరంగా పక్కనే పెట్టేసింది. ప్రస్తుతం ప్రజాకర్షణ ఉన్న బీరం హర్షవర్ధన్ రెడ్డికే టికెట్ కేటాయించింది. ప్రస్తుత నియోజకవర్గ పరిణామాలు చూస్తే బీరం గెలుపు ఈసారి కూడా ఖాయమే అని సర్వేలు చెబుతున్నాయి.

Also Read:సింగపూర్‌లో బతుకమ్మ వేడుకలు

- Advertisement -