మరో 5 రోజుల్లో ఎన్నికలు. ప్రచారం చేసుకునే వారు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఒకరి పై మరొకరు నిందలు మోపుకుంటున్నారు. ఇక్కడి వరకు ఓకె. ఇది రాజకీయం. ఇలాంటివి కామన్ . కానీ మహిళలని రాళ్లతో కొట్టించడం ఏంటి? ఉన్మాదిలా మారడం ఏంటి.?
విషయంలోకి వెళ్తే..గోపాలపురం నియోజకవర్గంలో హోంమంత్రి తానేటి వనితపై దాడి, అలాగే విజయవాడలో మహిళలపై బోండా ఉమ అనుచరుల దాడులు, అటు బనగానపల్లిలో కూడా టీడీపీ నాయకుల దాడులు. ఇవన్నీ చంద్రబాబు ఓటమి భయానికి నిదర్శనలు అనే వాదన వినిపిస్తుంది. ఈ రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మహిళలకు దక్కిన ప్రాధాన్యత గతంలో ఎప్పుడూ, ఎవ్వరూ చేయనిది. డీబీటీ పథకాల్లో కావొచ్చు, మంత్రి పదవుల్లో కావొచ్చు, ఎమ్మెల్యేలుగా, వివిధ నామినేటెడ్ పదవుల్లో వారికిచ్చిన అవకాశాలు అపారం. గతంలో ఏపార్టీ కూడా, ఏపార్టీ నాయకుడు కూడా జగన్ లా చేయలేదు’ అనే వారి మద్దతు దారులు పలుకుతున్న మాటలు.
వారు ఇంకా ప్రస్తావిస్తూ.. “ఒక్క జగన్ ని రాజకీయంగా దెబ్బకొట్టడానికి, అందరూ ఏకం అయ్యారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, పరోక్షంగా కాంగ్రెస్ ఇలా అందరూ ఈ ఎన్నికల్లో ఏకం అయ్యారు.కానీ జగన్గారికి ప్రజలు అండగా ఉన్నారు. అందరికంటే ఆయన్న అధికంగా ప్రేమిస్తున్న అక్కచెల్లెమ్మలు అండగా ఉన్నారు. ఎక్కడకు వెళ్లినా అక్కచెల్లెమ్మల అండ ఆయనకు స్పష్టంగా కనిపిస్తోంది. మా జీవితాల్లో భరోసాను నింపి మమ్మల్ని అన్నిరకాలుగా ఆదుకుంటున్న జగన్గారికి ఈ ఎన్నికల్లో తమ సంఘీభావాన్ని ప్రకటించేందుకు రాష్ట్రంలో మహిళాలోకం అంతా సిద్ధం అయ్యింది.చంద్రబాబు ఇచ్చిన బూటకపు హామీలను తిప్పికొడుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయడానికి మొత్తం మహిళాలోకం ఇవాళ కంకణం కట్టుకుంది. జగన్గారిని కాపాడేందుకు సిద్ధం అయ్యింది. దీన్ని చూసి భరించలేక చంద్రబాబు, ఆకూటమి నేతలు ఫ్రస్టేషన్లోకి వెళ్లిపోయారు. వారి ఫ్రస్టేషన్ ఏ స్థాయిలోకి వెళ్లింది అంటే.. చేయూత, ఆసతరా పథకాలకు డీబీటీని అడ్డుకుని వారి పొట్టకొడ్డమే కాదు, దళిత ఎమ్మెల్యే, సాక్షాత్తూ రాష్ట్ర హోంమంత్రి, సీనియర్ మహిళా నాయకురాలు తానేటి వనతిపై టీడీపీ గూండాలు దాడిచేశారు.
ఈ దాడివెనుక చంద్రబాబే ఉన్నారు. తాము ఆశించిన గోదావరి జిల్లాల్లో చంద్రబాబు, పవన్కళ్యాణ్ గిమ్మక్కులు పనిచేడయంలేదని, మహిళలు వారిని దూరంగా పెడుతున్నారని గ్రహించి… వారిని భయ భ్రాంతులకు గురిచేయడానికి ఈ దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు. చంద్రబాబు మహిళా లోకం తరఫున హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే నీ పార్టీని భూస్థాపితం చేశారు. ఇక భవిష్యత్తులో మరెప్పుడూ కూడా మీ పార్టీ లేవకుండా మీ పార్టీలను మహిళలంతా మరింతగా అదఃపాతాళానికి పంపబోతున్నారు. మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి.చంద్రబాబూ నీకు మహిళలంటే ఎలాగూ గౌరవం లేదు, నీ దత్తపుత్రుడికి అసలే గౌరవం లేదు… హోంమంత్రిపై దాడికి సంబంధించి మీరు కచ్చితంగా మూల్యం చెల్లించకమానదు. దళిత సోదరీ మణులు, సోదరులు అంతా కూడా ఇప్పటికే ఈ ఘటనపట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వారు కూడా మీ పార్టీలకు తగిన బుద్ధిచెప్పేందుకు సిద్ధం అయ్యారు. బోండా ఉమాకు కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాం. ఒళ్లు అదుపులో పెట్టుకుని ప్రవర్తించాలి. మహిళలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం’ అంటూ హుకూం జారీ చేస్తున్నారు.
Also Read:BJP:గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుజ్జుల..