మంకీపాక్స్‌పై WHO హెచ్చరికలు జారీ

181
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా కరోనా తర్వాత అత్యధిక కేసులు నమోదవుతున్న మంకీపాక్స్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్‌ కేసు తగ్గతుందన్న సమయంలోనే మళ్లీ విజృంభిస్తోందని తెలిపింది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా 70వేల మార్క్‌ను దాటిందని టెడ్రోస్ ప్రకటించారు. ఈ మహమ్మరి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ప్రపంచం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా హెచ్చిరించింది.

కేసులు తగ్గిన జాగ్రత్తలు తీసుకోవాలని అని సూచించింది. గతవారం మంకీపాక్స్‌ కేసులు పెరిగిన దేశాల్లో అమెరికా కాంటినెంట్‌ దేశాలు అధికంగా ఉన్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా కేసులు తగ్గముఖం పడుతుండగా.. గతవారం 21 దేశాల్లో కేసులు పెరిగాయన్నారు. అమెరికా ఖండంలోని దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల్లో 90శాతం గుర్తించారు. మంకీపాక్స్ కేసులు తగ్గుముఖం పట్టే సమయం అత్యంత ప్రమాదకరమని టెడ్రోస్‌ పేర్కొన్నారు. ఎందుకంటే ఈ సమయంలో వైరస్‌ తగ్గిందని భావించి జాగ్రత్తలు తీసుకోవడం మానేస్తామని.. దీంతో మళ్లీ పెరిగే ప్రమాదం ఉంటుందన్నారు. పరీక్షల సామార్థ్యం పెంచడంతో పాటు నిఘా వ్యవస్థను మెరుగుపరిచేందుకు WHO కృషి చేస్తుందన్నారు.

- Advertisement -