కరోనా వైరస్ మూలాలు(జెనటిక్ సీక్వెన్స్) గుర్తించామని కీలక ప్రకటన చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్ధ(డబ్ల్యూహెచ్‌వో). ఈ మేరకు కీలక ప్రకటన చేశారు డబ్ల్యూహెచ్‌వో హెల్త్ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్‌లో టెక్నికల్ లీడ్‌గా పనిచేస్తున్న డాక్టర్ మారియా వాన్ కెర్కోవ్.
వైరస్‌ను అతి తక్కువ సమయంలో గుర్తించడం అసాధారణమైన విషయమన్నారు. వైరస్‌కు చెందిన జన్యు క్రమాన్ని కొన్ని రోజుల క్రితమే షేర్ చేసినట్లు ఆమె చెప్పారు. ఇప్పుడు సిరాలాజికల్ అధ్యయనం సాగుతుందన్నారు. చైనాతో పాటు బాధిత ప్రపంచ దేశాలు కరోనా పాజిటివ్ వ్యక్తుల సీరమ్‌ను పరీక్ష చేయవచ్చు అన్నారు.
పాలీమిరేజ్ చైన్ రియాక్షన్(పీసీఆర్)తో పాటు సీరాలిజికల్ విశ్లేషణను పరిశోధనశాలలో నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. కొత్త వ్యాధిగా రూపాంతరం చెందిన కరోనా వైరస్‌కు సంబంధించి కావాల్సినంత సమాచారం తమ దగ్గర ఉందని కెర్కోవ్ చెప్పారు.