చైనాకు షాకిచ్చిన డబ్ల్యూహెచ్‌వో..!

245
who
- Advertisement -

కరోనాతో ప్రపంచదేశాలు గజగజ వణికిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 213 దేశాలకు కరోనా విస్తరించగా కరోనా విషయంలో చైనాకు షాకిచ్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్‌వో).

ఇప్పటివరకు కరోనా విషయంలో చైనా తీరుపై ప్రశంసలు గుప్పించిన డబ్ల్యూహెచ్‌వో తాజాగా డ్రాగన్ కంట్రీకి షాకిచ్చింది. డిసెంబర్ 31 వ తేదీన వుహాన్ నగరంలో న్యూమోనియా వంటి కేసులు నమోదైన సమయంలో దానికి సంబంధించిన సమాచారం కోరగా సమాచారం ఇవ్వలేదని, మొదట కరోనాకు సంబంధించిన సమాచారాన్ని చైనాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయమే తెలియజేసిందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.

వైర‌స్ నియంత్ర‌ణ‌లో డ‌బ్ల్యూహెచ్‌వో విఫ‌ల‌మైన‌ట్లు అగ్ర‌రాజ్యం అమెరికా ఆరోపిస్తున్న నేప‌థ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్ధ చైనాకు షాకివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -