దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 6 వేలకు పైగా కేసులు నమోదు కాగా కొత్త రకం వేరియంట్ ప్రమాదాకారా అన్న దానిపై సందేహాలు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో డ్యబ్లూహెచ్‌వో క్లారిటీ ఇచ్చింది.
గత వేరియంట్‌ల కంటే వేగంగా వ్యాపించగల సామర్థ్యం ఎన్‌బీ.1.8.1 కలిగి ఉన్నదని తెలిపింది. తీవ్రమైన లక్షణాలు, తీవ్రమైన అస్వస్థతకు కారణమవుతున్నట్టు కనిపించడం లేదని తెలిపింది.
వైరస్ అనేది మ్యటేట్ అవడం, కాలాన్ని బట్టి మారుతూ ఉండటం సాధారణమే. బ్రిటన్‌తోపాటు వివిధ దేశాల్లో సార్స్ కోవ్ 2 వేరియంట్స్‌కు సంబంధించి అందుబాటులో ఉన్న డాటాను యూకేహెచ్‌ఎస్‌ఏ సమీక్షిస్తుందని వెల్లడించింది. అన్ని కొవిడ్19 కేసులతో సమానంగానే ఇది కూడా విస్తరిస్తున్నదని పేర్కొంది. ఎన్‌బీ.1.8.1 వేరియంట్‌ను చైనా, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్, అమెరికా, యూకే, భారత్ సహా కనీసం 22 దేశాల్లో గుర్తించారు.
Also Read:Talasani:మాగంటి మృతి బాధాకరం

