జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్ట్

2
- Advertisement -

జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌ లో ఈ కేసు రిజిస్టర్ అయ్యింది. వెంటనే ప్రత్యేక పోలీస్ బృందాలు హైదరాబాద్‌కు చేరుకుని ఈరోజు ఉదయం ఆయన నివాసంలోనే కొమ్మినేని శ్రీనివాస్‌ ను అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్‌లో కొమ్మినేనిని అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడకు తరలించారు. అమరావతి మహిళలను కించపరిచిన కేసులో కొమ్మినేని శ్రీనివాస్ రావు, జర్నలిస్టు కృష్ణం రాజుపై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే.

నాలుగు రోజుల క్రితం సాక్షి ఛానెల్‌ లో జరిగిన డిబేట్‌ లో జర్నలిస్ట్ కృష్ణం రాజు.. అమరావతి దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. మహిళా సంఘాలతో పాటు అన్ని రాజకీయ పక్షాలు, వివిధ పార్టీలకు చెందిన నేతలు ఈ వ్యాఖ్యలను ఖండించారు. మహిళలను కించపరిచిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు…

ఈ నేపథ్యంలో మహిళా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో పాటు ర్యాలీలు నిర్వహించారు…పలు పోలీస్‌ స్టేషన్‌ లలో ఫిర్యాదులు చేశారు.

Also Read:Talasani:మాగంటి మృతి బాధాకరం

- Advertisement -