వివేకా హత్యలో ‘జగన్ పాత్ర’?

23
- Advertisement -

2019 ఎన్నికల ముందు ఏపీలో సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ కూడా మిస్టరీగా ఉన్న సంగతి తెలిసిందే. ఐదేళ్లు గడిచిన ఈ కేసులోని దొషులకు శిక్ష పడకపోవడం నిజంగా అందరినీ ఆశ్చర్య పరిచే విషయమే. వివేకా హత్య కేసులో ఇప్పటికే చాలమంది పేర్లు బయటకు వచ్చినప్పటికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ కేసు ఇప్పటికి మిస్టరీగా ఉండడం వెనుక ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని మొదటి నుంచి కూడా ఆరోపణలు విమర్శలు వ్యక్తమౌతూనే ఉన్నాయి. నేరస్తులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తోందని సీబీఐ పలు మార్లు స్పష్టం చేసింది కూడా.

అయినప్పటికీ ఈ కేసు ఏ మాత్రం ముందుకు సాగడం లేదు. ఇకపోతే ఎన్నికల ముందు ఈ కేసు మరోసారి హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది. సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజున వివేకానంద రెడ్డి హత్య గావింపబడ్డాడు.. నేడు ఆయన 5వ వర్దంతి సందర్భంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. వివేకా తనకు తండ్రి తరువాత తండ్రి లాంటి వారని, సాయం చేయడంలో ఎప్పుడు ముందుండే వారని షర్మిల అన్నారు. ఆయన హత్య కేసులో ధోషులకు ఇంకా శిక్ష పడకపోవడం భాదకరం అని ఆమె ఆవేధన వ్యక్తం చేశారు. సాక్షాలన్నీ బంధువులే హంతకులుగా చెబుతున్నాయని, అన్న అని పిలిపించుకునే వాడే నేరస్తులకు రక్షణ కలిపిస్తున్నారని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.

ఆమె చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా జగన్ ను ఉద్దేశించినవే అని ఏపీ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. దీంతో ఎన్నికల ముందు ఈ కాంట్రవర్సీ టాపిక్ మరోసారి తెరపైకి రావడంతో జగన్ పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే గత ఎన్నికల ముందు వివేకా హత్యఫై తీవ్ర స్థాయిలో స్పందించిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇంతవరకు ఒక్కసారి కూడా వివేకా హత్యపై స్పందించలేదు. దీన్ని బట్టి వివేకా హత్య కేసులో జగన్ పాత్ర ఉందనేది ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు సొంత చెల్లి షర్మిల కూడా జగన్ వైపే వేలెత్తి చూపేలా వ్యాఖ్యానిస్తుండడంతో కచ్చితంగా ఈ అంశం వైసీపీకి గట్టి దెబ్బే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Also Read:బీఆర్ఎస్‌తో బీఎస్పీ..రెండు ఎంపీ సీట్లు

- Advertisement -