సంక్రాంతి విన్నర్ ఎవరంటే ?

36
- Advertisement -

సంక్రాంతి పండుగ గొప్పగా ముగిసింది. బాక్సాఫీస్ కూడా సంక్రాంతి సందడితో లాభాల పంట పండించింది. మరీ సంక్రాంతి బరిలో విన్నర్ ఎవరు..?, ఈ సారి సంక్రాంతి పోటీలో 4 రోజుల్లో 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. జనవరి 11న రిలీజైన ‘తెగింపు’తో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నాడు అజిత్. జనవరి 12న రిలీజైన వీరసింహారెడ్డితో ఫ్యాన్స్ కు తెగ నచ్చాడు బాలయ్య. వాల్తేరు వీరయ్యతో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాడు చిరు. జనవరి 14న వచ్చిన వారసుడుతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచాడు విజయ్. చిన్న సినిమాగా విడుదలైన కళ్యాణం కమనీయం సినిమాతో సంక్రాంతి సినిమా సీజన్ కు శుభం కార్డు పడింది. మరీ విన్నర్ ఎవరు ?,

పైగా ఈ సారి టాలీవుడ్ స్క్రీన్ మీద సంక్రాంతి పోటీ మస్త్ కిక్కిచ్చింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలయ్య ఒక్కరోజు తేడాతో బరిలోకి దిగడంతో పోటీ రసవత్తరంగా మారింది. అయితే నువ్వా ? నేనా ? అన్నట్టున్న టఫ్ ఫైట్ లో.. రెండు సినిమాలకు సక్సెస్ టాక్ రావడంతో ఫ్యాన్స్ లో మరింత హైప్ వచ్చింది. పోటీ అన్నాక ఎవరో ఒకరు గెలవాల్సిందే. అయితే పక్కా లెక్కలు తీస్తే.. వీరసింహారెడ్డి కన్నా ఒక్క అడుగు ముందున్నాడు వాల్తేరు వీరయ్య. కారణం.. సినిమాకి పాజిటివ్ టాక్ రావడం, అన్నిటికీ మించి వీరయ్య కి తోడు రవితేజ కూడా సందడి చేయడం.. వాల్తేరు వీరయ్యకి బాగా కలిసొచ్చింది.

దాంతో.. సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్య విన్నర్ గా, వీరసింహారెడ్డి రన్నర్ గా నిలిచారు. ఇక తెగింపు, వారసుడు నష్టాల్లో చిక్కుకున్నారు. మొత్తమ్మీద సంక్రాంతి కానుకగా విడుదలైన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. విదేశాల్లోనూ జనం బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా రెండు సినిమాలకూ వసూళ్ల వర్షం కురుస్తోంది.

ఇవి కూడా చదవండి…

ఫేడ్ అవుట్ నుంచి ఫుల్ ఫామ్ లోకి

భోళా శంకర్ షూటింగ్ పునఃప్రారంభం

వైరల్ : దిల్ రాజు ‘పెన్’ లవ్ స్టోరీ

- Advertisement -