‘నా నువ్వే’ ఆడియో వేడుకకు ఎన్టీఆర్..?

210
Who Is The Special Guest At Na nuvve Audio Function?
- Advertisement -

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కతున్న చిత్రం ‘నా నువ్వే’. ఎప్పుడు మాస్ ప్రేక్షకులను అలరించే కళ్యాణ్ రామ్ ఈ సారి మాత్రం లవర్ బాయ్‌గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది మిల్క్ బ్యూటీ తమన్నా.

Who Is The Special Guest At Na nuvve Audio Function?

గతంలో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఎమ్మెల్యే’. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అశించినంత స్థాయితో ఆకట్టుకోలేక పోయింది. ఇప్పుడు ఈ సినిమాతోనైనా హిట్ కొట్టాలనే ఆశతో ఉన్నాడు కళ్యాణ్‌ రామ్. ఇక విషయానికొస్తే ‘నా నువ్వు’ చిత్రం ఆడియో వేడుకను ఈ నెల 6వ తేదీన జరుగునుంది. ఆడియో లాంచ్‌ను భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. అయితే ఈ ఆడియో వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ రానున్నట్లు సమాచారం.

గతంలో ఎన్టీఆర్ మహేష్‌ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భరత్ అనే నేను’. ఈ సినిమా ఆడియో లాంచ్‌కు ఎన్టీఆర్ ముఖ్యఅతిధిగా హాజరైన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు వెన్నెల కిషోర్. షేరేత్ ఈ సినిమాకు సంగీతం అందించగా పీసీ శ్రీరామ్ కెమెరా పనితనం సినిమాకు ప్లస్ అవనుందట. టాలీవుడ్‌లో చాలా కాలం నుంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న తమన్నాకు ఈ సినిమాతోనైనా హిట్ అందుతుందో చూడాలి మరి.!

- Advertisement -