అఫ్గాన్ టూర్ లో కెప్టెన్ ఎవరు ?

32
- Advertisement -

ప్రస్తుతం టీమిండియా సౌతాఫ్రికా టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రోటీస్ జట్టుతో ఇప్పటికే టీ20 సిరీస్, వన్డే సిరీస్ పూర్తి చేసిన టీమిండియా ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ఆడుతోంది. టీ20 సిరీస్ లో సమంగా నిలిచినప్పటికీ, వన్డే సిరీస్ ను మాత్రం కైవసం చేసుకుంది. ఇక టెస్ట్ సిరీస్ లో కూడా విజయం సాధించి దక్షిణాఫ్రికా టూర్ కు ప్యాకప్ చెప్పాలని చూస్తున్నారు టీమిండియా ఆటగాళ్లు. ఇక ఆ తరువాత అఫ్గానిస్తాన్ టూర్ వెళ్లాల్సి ఉంది. అఫ్గాన్ తో మూడు టీ20 మ్యాచ్ లు అడనుంది టీమిండియా. ఈ సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్ కు టీమిండియా తరుపున టీ20 కెప్టెన్ గా ఎవరు వ్యవహరించనున్నరనేది ఆసక్తికరంగా మారింది. రెగ్యులర్ టీమిండియా కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ గత కొంత కాలంగా టీ20 మ్యాచ్ లకు దూరంగా ఉంటున్నాడు. దాంతో కెప్టెన్ విషయంలో ప్రయోగాలు చేస్తూ వస్తోంది బీసీసీఐ.

గతంలో టీ20 మ్యాచ్ లకు హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించగా.. ఇటీవల ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్ లకు సూర్యకుమార్ యాదవ్ ను నియమించింది. అయితే వన్డే వరల్డ్ కప్ లో గాయపడ్డ హార్దిక్ పాండ్య ఇంకా పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించలేదని వార్తలు వస్తున్నాయి. దాంతో అఫ్గాన్ టూర్ కు కూడా పాండ్య దూరంగానే ఉండే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం టీ20లకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సూర్యకుమార్ యాదవ్ కూడా ఇటీవల గాయానికి గురయ్యాడు. దాంతో అఫ్గానిస్తాన్ తో జరిగే టీ20 మ్యాచ్ లకు ఎవరు కెప్టెన్ అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ ఆ సమయానికి సూర్య కుమార్ యాదవ్ ఫిట్నెస్ సాధిస్తే అతడినే కెప్టెన్ చేసే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లేదంటే కే‌ఎల్ రాహుల్ ఆ బాద్యతలు నిర్వర్తించే అవకాశం ఉంది. అయితే రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులోకి వస్తే అతడే కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉంది.

Also Read:Revanth Reddy:ప్రజల వద్దకే పాలన

- Advertisement -