Modi:మోడీ తర్వాత ఎవరు?

34
- Advertisement -

బీజేపీ నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా నరేంద్ర మోడీ గుర్తింపు పొందారు. కేవలం మోడీ మేనియా వల్లే 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈసారి ఎన్నికల్లో కూడా మోడీనే నమ్ముకుంది భారత జనతా పార్టీ. అయితే మోడీ తర్వాత బీజేపీని ముందుండి నడిపించేదేవరు అనేది గత కొన్నాళ్లుగా అందరిలోనూ తోలుస్తున్న ప్రశ్న. ఎందుకంటే బీజేపీలో ఎంతో మంది అగ్రనేతలు ఉన్నప్పటికి వారంతా కూడా మోడీ షాడోలోనే ఉండడంతో మోడీ తరువాత ఎవరు అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం అంతా తేలికైన విషయం కాదు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకత్వాన్ని ముందుండి నడిపించే బాద్యత మోడీ తరువాత ఎవరు తీసుకుంటే బాగుంటుందనే దానిపై ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. .

మోడీ వారసత్వాన్ని కొనసాగించేందుకు అమిత్ షా సమర్థుడని 29 శాతం ప్రజలు కోరుకుంటున్నట్లు ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ నేషన్ సర్వే వెల్లడించింది. అమిత్ షా తరువాత ఉత్తర ప్రదేశ్ సి‌ఎం యోగి ఆదిత్యనాథ్ ను 25 శాతం ప్రజలు, నితీశ్ గడ్కరీ ని 16 శాతం ప్రజలు కోరుకుంటున్నట్లు.. సర్వే తెలిపింది. అయితే మోడీ విషయంలో ప్రజల నుంచి కనిపించిన సానుకూలత వీరి విషయంలో కనిపిస్తుందా అంటే చెప్పలేని పరిస్థితి. ఇక మోడీపై కూడా గతంలో ఉన్న ప్రజాభిమానం ప్రస్తుతం కనిపించడంలేదు. అందువల్ల మోడీ తర్వాత ప్రత్యామ్నాయ లీడర్ ను బీజేపీ ఏర్పరచుకోవాల్సిన అవసరత ఉంది. మరి ఈ సారి జరిగే ఎన్నికల నుంచే మోడీ వారసత్వ లీడర్ ను బీజేపీ పరిచయం చేస్తుందా లేదా ఈసారి కూడా మోడీ మీదనే ఆధారపడుతుందా అనేది చూడాలి.

Also Read:Revanth Reddy: గుంపు మేస్త్రి పాలన.. ఇదేనా?

- Advertisement -