కర్నాటక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొత్త చిక్కు వచ్చిపడింది. 136 స్థానాలను కైవసం చేసుకొని ఎకపక్షంగా ప్రభుత్వాన్ని స్థాపించబోతున్న హస్తం పార్టీకి సిఎం ను ఎన్నుకోవడం పెద్ద అగ్నిపరీక్షగా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్ తరుపున సిఎం రేస్ లో మాజీ ముఖ్యమంత్రి సిద్దిరామయ్య, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ రేస్ లో ఉన్నారు. ఇద్దరు బలమైన నేతలు కావడంతో హైకమాండ్ ఎవరిని సిఎం చేయాలనే దానిపై తలపట్టుకుంటుంది. కాంగ్రెస్ తరుపున సిద్దిరామయ్య 2013 నుంచి 2018 వరకు సిఎం గా కొనసాగారు. ఆయన పరిపాలనపై ప్రజల్లో కూడా సానుకూలత ఉంది.
ఈ నేపథ్యంలో సిద్దిరామయ్యకు మరోసారి సిఎం బాద్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే దానిపై అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు డీకే శివకుమార్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో ఆయన కృషి ఎంతో ఉంది. క్షేత్రస్థాయిలో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటూ కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించారు డీకే శివకుమార్. ఎన్నికల ముందు కాంగ్రెస్ కు 136 సీట్లు ఖాయం అని బలంగా చెప్పిన శివకుమార్.. ఆయన చెప్పినట్లుగానే హస్తం పార్టీ కరెక్ట్ గా 136 స్థానాలను (136-1=135 ) కైవసం చేసుకుందంటే శివకుమార్ పార్టీ విజయం పై ఏ స్థాయిలో కాన్ఫిడెంట్ ప్రదర్శించడో అర్థం చేసుకోవచ్చు.
Also Read:మదర్స్ డే.. అమ్మ కు ప్రేమతో
మరి పార్టీ గెలుపు కోసం అంతగా కృషి చేసిన డీకే శివకుమార్ కు సిఎం పదవి కట్టబెట్టాలని ఆయన వర్గం నుంచి వినిపిస్తున్న మాట. పార్టీ పెద్దలు కూడా కొంతమంది సిఎం గా శివకుమార్ పేరును ప్రస్తావిస్తున్నారట. దీంతో అటు సిద్దిరామయ్య, ఇటు డీకే శివకుమార్ ఇద్దరిలో ఎవరిని సిఎంగా నియమించాలని కాంగ్రెస్ తర్జన భర్జన పడుతుంది. అయితే నేడు సాయంత్రం సీఎల్పీ సమావేశంలో సిఎం ఎవరనేది ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. విశ్వసనీయ సమాచారల ప్రకారం కాంగ్రెస్ అధిష్టానం సిద్దిరామయ్య కే సిఎం పదవి కట్టబెట్టే ఛాన్స్ ఉందట. ఒకవేళ ఇదే జరిగితే డీకే శివకుమార్ స్వాగతిస్తారా అనేది కూడా ఆసక్తికరమే. మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.