Boyapati:బోయపాటి నెక్స్ట్ హీరో ఎవరు?

17
- Advertisement -

టాలీవుడ్ లో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే అందరికీ గుర్తొచ్చే పేరు బోయపాటి శ్రీను. హీరోయిజాన్ని నెక్స్ట్ లెవెల్ లో ఎలివేట్ చేయడంలో బోయపాటి శ్రీను తరువాతే ఎవరైనా. అయితే కొన్ని సార్లు మితిమీరిన హీరోయిజం కారణంగా ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుంటాయి. బోల్తా కొట్టడమే కాదు విమర్శలకు కూడా లోనవుతుంటాయి. ఇక బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన గత చిత్రం ” స్కంద ” బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. దీంతో బోయపాటి నెక్ట్స్ ఏ హీరోతో చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అఖండ సిక్వల్ కోసం కథ ప్రిపేర్ చేసే పనిలో ఉన్నాడట బోయపాటి..

అయితే ఆ మద్య గీత ఆర్ట్స్ లో ఓ ప్రాజెక్ట్ కు బోయపాటి శ్రీను సంతకం చేసినట్లుగా వార్తలు వినిపించాయి. ఈ ప్రాజెక్ట్ సరైనోడు సిక్వల్ అని గుసగుసలు కూడా వచ్చాయి. అయితే వాటిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఇంకా కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో కూడా బోయపాటి మూవీ చేసే ఛాన్స్ ఉందనే రూమర్స్ కూడా వచ్చాయి. అవి కూడా కన్ఫర్మ్ కాలేదు. ఇక ఇప్పుడు మరో క్రేజీ రూమర్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

బోయపాటి నెక్స్ట్ మూవీలో విజయ్ దేవరకొండ హీరోగా చేయబోతున్నట్లు వినికిడి. విజయ్ కోసం ఓ మాస్ ఎంటర్ టైనర్ ను బోయపాటి సిద్దం చేసినట్లు టాక్. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ ” మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ ఏప్రెల్ 5 న విడుదల కాబోతుంది. ఈ మూవీ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలోనే నటించే అవకాశం ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ క్రేజీ కాంబినేషన్ పై అటు బోయపాటి గాని, ఇటు విజయ్ దేవరకొండ గాని కన్ఫర్మ్ చేయలేదు. మరి బోయపాటి శ్రీను డైరెక్షన్ లోనటించే ఆ హీరో ఎవరో చూడాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Also Read:చింతచిగురుతో ప్రయోజనాలు తెలుసా?

- Advertisement -