కరోనా వైరస్ చైనా ల్యాబ్ నుండే పుట్టిందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటివరకు స్పష్టత రాకపోగా కరోనా వచ్చిన సంవత్సరం తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లూహెచ్‌వో) క్లారిటీ ఇచ్చింది.
కరోనా వైరస్ ల్యాబ్ నుంచి లీకవడం కాదు.. గబ్బిలాల నుంచి మరో జంతువు ద్వారా మనుషులకు సోకి ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో, చైనా అధ్యయనం తేల్చింది. ల్యాబ్ లీక్ అంశాన్ని వదిలేసి మిగతా అంశాలపై మరింత విచారణ జరపాల్సిన అవసరం ఉన్నదని డబ్ల్యూహెచ్‌వో, చైనా సంయుక్త నివేదిక చెప్పడం గమనార్హం.
గత జనవరిలోనే చైనాకు వెళ్లి కరోనా మూలాలను పరిశీలించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) బృందం. అయితే డబ్ల్యూహెచ్‌వో నివేదికపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచమంతా ఈ మహమ్మారికి చైనాను బాధ్యురాలిని చేస్తున్న నేపథ్యంలో ఈ రిపోర్టును చైనా మారుస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జెనీవాలో ఉన్న ఓ దౌత్యవేత్త ద్వారా ఈ ముసాయిదా రిపోర్టును ప్రముఖ ఏజెన్సీ అసోసియేటెడ్ ఏజెన్సీ సంపాదించింది.