ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి 180 దేశాలకి పైగా విస్తరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలో 249 కరోనా కేసులు నమోదుకాగా 18 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇక కరోనా రోజురోజుకు మరింతగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ యూత్‌కి హెచ్చరికలు జారీ చేసింది. వైరస్ వల్ల టీనేజీ యువత కూడా తీవ్ర అనారోగ్యానికి లోనవుతున్నట్లు డబ్ల్యూహెచ్‌వో డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అదనమ్ గేబ్రియాసిస్ తెలిపారు. వైరస్ ఛాయలు ప్రతి రోజూ ఓ కొత్త మైలురాయిని చేరుకుంటున్నట్లు టెడ్రోస్ తెలిపారు.
యువత వల్లే ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్‌వో అభిప్రాయపడింది. ఎక్కువ శాతం మంది వృద్ధులే మరణిస్తున్నా.. వైరస్ మాత్రం యువత వల్ల వివిధ ప్రాంతాలకు విస్తరిస్తోందన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా వైరస్ కేసులు రెండున్నర లక్షలకు చేరుకున్నది. తెలంగాణలో 19,మహారాష్ట్రలో 53, కేరళలో 40, ఉత్తరప్రదేశ్‌లో 23, రాజస్థాన్‌లో 17, ఢిల్లీలో 17, కర్ణాటక 16, లడఖ్ 10, కేరళలో 12, హిమాచల్ ప్రదేశ్‌లో రెండు, బెంగాల్‌లో మూడు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.