వ్యాక్సిన్ వినియోగంలో ముందున్న ధనిక దేశాలు..

60
corona

ప్రపంచవ్యాప్తంగా కరోనా కట్టడిలో భాగంగా వ్యాక్సినేషన్‌పై అన్ని దేశాలు దృష్టిసారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా కట్టడిలో అభివృద్ధి చెందిన దేశాలు మెరుగైన వైద్య సదుపాయాలతో కరోనాను కట్టడి చేయగలుగుతున్న పేద దేశాలు మాత్రం అల్లాడిపోతున్నాయి.

ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. పేద దేశాల్లో ప‌రిస్థితి ఇంత దారుణంగా ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అమ‌ల్లోకి వ‌చ్చిన వ్యాక్సిన్‌ల వినియోగంలో ధ‌నిక దేశాలే ముందున్నాయి.

ప్ర‌పంచంలో ధ‌నిక, ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి దేశాల జ‌నాభా 53 శాతం ఉండ‌గా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లో 83 శాతాన్ని ఆ దేశాలే వినియోగించాయ‌ని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. పేద‌, దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి దేశాల జ‌నాభా ప్ర‌పంచ జ‌నాభాలో 47 శాతం ఉందని, కానీ ఆయా దేశాల్లో వ్యాక్సిన్ వినియోగం కేవ‌లం 17 శాతం మాత్ర‌మే ఉందని తెలిపింది.