ఒకే రోజు రెండు ఫస్ట్‌లుక్స్‌తో వచ్చిన రాయ్‌లక్ష్మి..

235
- Advertisement -

రాయ్ లక్ష్మీ ఓవైపు అదిరిపోయే గ్లామర్ రోల్స్‌తో మరో వైపు ఐటెమ్ నంబర్లతో హీటెక్కిస్తోంది. అయితే ఈ అమ్మడు ఈ మద్య హారర్ చిత్రాలతోనూ దూసుకుపోతుంది. ఇదివరకూ హన్సిక నటించిన `చంద్రకళ` చిత్రంలో రాయ్ లక్ష్మీ గ్లామర్ పాత్రతో ఆకట్టుకుంది. ఆ తర్వాత బాలీవుడ్‌లో తన అదృష్టం పరిక్షించుకుందామని `జూలీ2` లాంటి వివాదాస్పద చిత్రంలో నటించింది. కానీ కాలం కలిసిరాక తిరిగి సౌత్ కే వచ్చేసింది.

అయితే ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళంలో రెండు విభిన్నమైన కాన్సెప్ట్‌లతో తెరకెక్కుతున్న చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగులో రాయ్‌లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వేర్‌ ఈజ్‌ వెంకటలక్ష్మి’. ఈ మూవీకి క్రిష్ణ కిశోర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఏబీటీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రవీణ్‌, మధునందన్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను హీరో నితిన్‌ ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

Raai Lakshmi

ఇక ఈ అమ్మడు తమిళంలో నటిస్తున్న మరో చిత్రం ‘సిండ్రెల్లా’. వినూ వెంకటేశ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎస్‌ఐ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ కూడా ఇదే రోజు విడుదల చేయడం విశేషం. రాయ్‌లక్ష్మి ఈ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. హారర్‌, థ్రిల్లర్‌ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌లోనూ రాయ్‌లక్ష్మి రెండు విభిన్న గెటప్స్‌లో ఆకట్టుకుంటున్నారు. లుక్‌లో సగం ముఖ భాగం తలలో పువ్వులు, అందమైన కళ్లు, పెదాలతో అందంగా ఉన్నారు. మరో భాగంలో నోరు, కళ్ల నుంచి కారుతున్న రక్తంతో భయకరంగా ఉన్నారు. ‘సిండ్రెల్లా’ చిత్రానికి అశ్వమిత్ర సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -